Tips For Good Sleeping: ఈజీగా నిద్రపట్టాలంటే ఇలా చేయండి

Tips For Good Sleeping: కొంతమందికి వద్దన్నా నిద్రొస్తుంది.. వాళ్లకు నిద్రను ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటుంటారు. ఇంకొంతమందికి నిద్రంటే బంగారంతో సమానం. వారికి నిద్ర అంత ఈజీగా రాదు. క్రమక్రమంగా అదొక శారీరక రుగ్మతగా మారిపోతుంది. అదే కానీ జరిగితే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు మూల కారణం సరైన నిద్రలేకపోవడమే.

Written by - Pavan | Last Updated : Jul 31, 2023, 11:22 AM IST
Tips For Good Sleeping: ఈజీగా నిద్రపట్టాలంటే ఇలా చేయండి

Tips For Good Sleeping: నిద్రలేమి అనేది పెద్ద సమస్యగా కనిపించదు కానీ అనేక ఆరోగ్య సమస్యలకు అదే మూల కారణం అంటే నమ్ముతారా ? అవును, కంటి నిండా నిద్రపోయిన వారు శారీరకంగా, మానసికంగా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తూ ఆరోగ్యంగానూ ఉంటారు. నిద్రలేమితో బాధపడే వారి ముఖంలో ఉత్సాహం, ఉల్లాసం కనిపించకపోగా.. లోలోపలే ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. అందుకే మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఈజీగా నిద్రపోయేందుకు అవసరం అయిన టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

నిద్రలేమి : 
నిద్రలేమికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ చాలామందిలో నిద్రలేమికి కనిపించే సాధారణ కారణం మాత్రం ఒక సరైన రెగ్యులర్ స్లీపింగ్ రొటీన్ అనేది లేకపోవడమే. పడుకోవాల్సిన సమయంలో పడుకోకుండా సమయం దొరికినప్పుడే పడుకోవడం... లేదా ఒక సమయం పాటించకపోవడం నిద్రలేమి సమస్యకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే ప్రతీ రోజు రాత్రి త్వరగా అన్ని పనులు ముగించుకుని పడుకోవడం, తెల్లవారిజామున ఒకే సమయానికి నిద్ర లేవడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. అలా కొంతకాలం ఎక్సర్‌సైజ్ చేయగలిగితే.. ఆ తరువాత ఆ సమయానికి నిద్రపట్టడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది.

బెడ్ రూమ్‌లో ఉండే వాతావరణం :
ఈజీగా నిద్రపట్టడానికి బెడ్ రూమ్‌లో ఉండే వాతావరణం అనేది చాలా ముఖ్యం. ఎక్కువ లైట్ల వెలుతురు లేకుండా డార్క్, ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండేలా మీ బెడ్ రూమ్‌ వాతావరణం ఉండేలా చూసుకోండి. అప్పుడే మీకు ఈజీగా నిద్రపడుతుంది.

స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్, కంప్యూటర్స్ : 
స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్, కంప్యూటర్స్ నుంచి ఒక రకమైన బ్లూ లైట్ కిరణాలు వెలువడతాయి. అవి మీ కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే రాత్రి వేళ పడుకోవడానికంటే కనీసం ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని వినియోగించడం ఆపేయాలి.

శరీరానికి, మనసుకు హాయినిచ్చే హెల్తీ హ్యాబిట్స్ : 
ప్రతీ రోజూ పడుకోవడానికి ముందుగా శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే కొన్ని అలవాట్లు చేసుకోవాలి. పుస్తక పఠనం మంచి అలవాటు కనుక నచ్చిన పుస్తకాలు చదవడం చేయొచ్చు. లేదంటే గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేసి రిలాక్స్ అవడం, ధ్యానం చేయడం, డైరీ రాసుకోవడం వంటివి చేయొచ్చు. 

ఇది కూడా చదవండి : How To Stop White Hair: జుట్టు తెల్లబడకుండా ఉండటం మీ చేతుల్లోనే..

బెస్ట్ మ్యాట్రెస్ ఎంపిక :
నిద్ర సుఖం ఎరుగదు అనేది ఎంత వాస్తవమో.. సుఖమైన నిద్ర కోసం సౌకర్యవంతమైన మ్యాట్రెస్ కూడా అంతే ముఖ్యం. అందుకే కంఫర్టబుల్ మ్యాట్రెస్‌ని ఎంపిక చేసుకోవాలి.

ఇది కూడా చదవండి : Immunity In Monsoon Season: వర్షాకాలంలో జలుబు, జ్వరం లాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News