అధిక మాసం ( Adhika Maas 2020 ) నేటి నుంచి ప్రారంభం అయింది. అంటే 2020లో సెప్టెంబర్18 నుంచి అక్టోబర్ 16 వరకు అధిక మాసం ఉంటుంది. ఈ మాసంలో జపం చేయడం, తపస్సు, ఆరాధన , ఉపవాసం, దానాలకు ( Donation ) మంచి ఫలితాలు లభిస్తాయి. అధిక మాసం ప్రతీ మూడు సంవత్సరాలకు వస్తుంది. ఎన్నో లాభాలను తెస్తుంది.
అధిక మాసంలో దానాలు చేయాలి అని చాలా మందికి తెలుసు.. కానీ అందులో ఎలాంటి వస్తువులు దానాలు చేయాలి అనే విషయం మాత్రం తక్కువ మందికి తెలుసు. నిజానికి దానం చేయడం వల్ల మన జీవితంలో ( Life) ఉండే సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. పాపవినాశనం కలుగుతుంది అని పెద్దలు చెప్పడం మనం వినే ఉంటాము.
ALSO READ : Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు
కోరికలు నెరవేరుతాయి
అధిక మాసంలో శ్రీ మహా విష్ణువు పూజకు, ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన, పూజలు, ఆయన మంత్రాలను జపించడం వల్ల సమస్యలు తీరుతాయి అని భక్తుల విశ్వాసం. అధిక మాసం ఎంత పవిత్రమైన మాసం అంటే ఈ నెలలో విష్ణుమూర్తితో కటాక్షంతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. ధనధాన్యాలతో, పిల్లాపాపలతో సంతోషం ( Happiness ) కలుగుతుంది అని విశ్వాసం.
ALSO READ : Vastu: శ్రీకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెడితే ఇంట్లో సంపద కలుగుతుంది
ఈ 10 వస్తువులను దానం చేయడం వల్ల అత్యధిక పుణ్యం
మన పురాణాల్లో దానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతీ వ్యక్తి తన శక్తిమేరా దానం చేసి పుణ్యం సంపాదించవచ్చు అని పెద్దలు చెబుతుంటారు. ఈ నెలను అధిక మాసం అనడానికి కారణం.. మనకు సంవత్సరానికి 12 నెలలు ఉండగా.. ఈ నెలను మాత్రం13వ నెలగా పిలుస్తారు. అంటే ఇది అధికంగా వచ్చే మరో మాసం. కాబట్టి దీన్ని అధిక మాసం అంటారు. ఈ నెలలో భక్తులు విష్ణుమూర్తిని పూజించి ఆ ప్రసాదాన్ని దానం చేయాలి.
దానం చేయాల్సినవి
అధిక మాసంలో దానం చేయాల్సిన వస్తువుల్లో బెల్లం (Jaggery ), నెయ్యి ( Ghee), బియ్యం (Rice ) వంటి వాటిని బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల బాధలు తొలగుతాయి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. వచ్చే జన్మకు కావాల్సిన ఆనందాన్ని ఇప్పుడే మీరు సంపాదించుకున్నట్టు. అంటే రానున్న జన్మ మరింత ఆనందకరంగా ఉంటుంది. ఈ జన్మలో మనిషి సంతోషాన్ని పొందగలుగారు అని పెద్దలు చెబుతుంటారు.
ALSO READ : Vastu and Health: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే వాస్తుదోషాలు తొలిగి ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుంది
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR