Weight Loss Tips: నిద్రపోయేముందు ఈ 6 పనులు చేస్తే..కేవలం 10 రోజుల్లో అధిక బరువుకు చెక్

Weight Loss Tips: అధిక బరువు అనేది ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే..బరువు సులభంగా తగ్గించుకోవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 8, 2023, 07:44 PM IST
Weight Loss Tips: నిద్రపోయేముందు ఈ 6 పనులు చేస్తే..కేవలం 10 రోజుల్లో అధిక బరువుకు చెక్

ఆధునిక జీవనశైలి కారణంగా స్థూలకాయం ఇబ్బందిగా మారుతోంది. స్థూలకాయం సమస్య నుంచి విముక్తి పొందేందుకు వ్యాయామం, డైట్ కంట్రోల్‌తోపాటు మరి కొన్ని చిట్కాలు పాటిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. రోజూ రాత్రి పూట నిద్రించేముందు ఈ టిప్స్ పాటిస్తే సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. 

నిద్రకు 2 గంటల ముందు భోజనం

అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు రాత్రి వేళ తేలికైన భోజనం చాలా అవసరం. అందుకే నిద్రించడానికి కనీసం 2 గంటల ముందు భోజనం పూర్తి చేయాలి. భోజనంలో సాధ్యమైనంతవరకూ త్వరగా జీర్ణమయ్యే పదార్ధాలుండేట్టు చూసుకోవాలి. భోజనం తరువాత కాస్సేపు లైట్ వాక్ చేయాలి. 

భోజనానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ తిండియావను తగ్గిస్తుంది. అందుకే అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు భోజనానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల బాడీ డీటాక్స్ కూడా అవుతుంది. దాంతోపాటు ఎక్కువగా తినకుండా ఉంటారు.

నో ఆల్కహాల్

ఆల్కహాల్‌లో పెద్దమొత్తంలో కేలరీలుంటాయి. రాత్రి నిద్రపోయే ముందు ఆల్కహాల్ తీసుకుంటే వేగంగా బరువు పెరిగిపోతారు. అందుకే బరువు తగ్గాలంటే..రాత్రి నిద్రపోయే ముందు పొరపాటున కూడా ఆల్కహాల్ తీసుకోకూడదు.

నిద్రించేముందు మెడిటేషన్

బరువు పెరగడానికి దోహదపడే కారణాల్లో ఒత్తిడి ప్రధానమైంది. ఆందోళన కారణంగా బరువు పెరుగుతారు. అందుకే మెడిటేషన్ సరైన పరిష్కారం కాగలదు. అందుకే నిద్రించేముందు మెడిటేషన్ చాలా ముఖ్యం.

వేడినీళ్లతో స్నానం

బరువు తగ్గేందుకు సరైన నిద్ర కూడా చాలా అవసరం. రోజూ పడుకునే ముందు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఎందుకంటే వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల బాడీ పూర్తిగా రిలాక్స్ అవుతుంది. ఫలితంగా రాత్రి మంచి నిద్ర పడుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గడంలో దోహదపడుతుంది. 

నిద్రకు ముందు టీ, కాఫీలకు దూరం

నిద్రించే ముందు పొరపాటున కూడా టీ, కాఫీలు తాగకూడదు. ఎందుకంటే రాత్రి టీ, కాఫీ తాగడం వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది. నిద్ర పూర్తి కాకపోవడంతో మెటబోలిజం పాడవుతుంది. ఇది బరువు పెరిగేందుకు దోహదపడుతుంది. అందుకే రాత్రి వేళ టీ, కాఫీ తాగే అలవాటుంటే మానుకోవడం మంచిది. 

Also read: Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే నిర్లక్ష్యం ప్రాణాంతకమౌతుంది, తక్షణం ఈ పదార్ధాలు తీసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News