Weight Loss Tips: స్థూలకాయం అనేది ఓ పెను సమస్య. ఈ ఒక్క సమస్య కారణంగా డయాబెటిస్, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి ప్రమాదకర వ్యాధులు తలెత్తవచ్చు. క్రమంగా ఈ పరిస్థితి గుండెపోటుకు కారణం కావచ్చు. అయితే ప్రకృతిలో లభించే కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
ప్రకృతిలో లభించే కొన్ని రకాల పదార్ధాల్లో లభించే అద్బుతమైన పోషకాలతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బరువు తగ్గించుకునేందుకు అవసరమైన పోషకాలు పెద్దమొత్తంలో ఉన్నాయి. వీటిలో చాలావరకూ ప్రతి కిచెన్‌లో లభించే పదార్ధాలే. వీటితో నేచురల్ డ్రింక్స్ తయారు చేసుకుని తాగితే అధిక బరువుకు చెక్ చెప్పవచ్చు. నెల రోజుల వ్యవధిలోనే బెల్లీ ఫ్యాట్ సైతం కరుగుతుంది.
ఇందులో ప్రధానంగా అల్లం, పుసుపు, పుదీనా, లెమన్ గ్రాస్ వంటి మూలికల్ని మిక్స్ చేసి తయారుచేస్తారు. ఈ సహజసిద్దమైన డ్రింక్ శరీరం ఇమ్యూనిటీని వేగంగా పెంచుతుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో సహజంగానే మెటబోలిజం వేగవంతమౌతుంది. ఇది కాస్తా జీర్ణక్రియను మెరుగుపర్చుతుంది. దాంతో శరీరంలో అదనంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది.
ఈ నేచురల్ డ్రింక్ తయారీ కూడా చాలా సులభం. కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా పుదీనా, 1 స్పూన్ పసుపు, కొద్దిగా లెమన్ గ్రాస్ తీసుకుని అన్నింటినీ కలిపి ఉడకబెట్టాలి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి.
ఇక ఇమ్యూనిటీ పెంచేందుకు కూడా కొన్ని పండ్లు, మూలికలు అవసరమౌతాయి. దీనికోసం బీట్‌రూట్, క్యారెట్, అల్లం, పసుపు, ఆరెంజ్ అవసరమౌతాయి. అన్నింటినీ కలిపి బ్లైండర్‌లో జ్యూస్ చేసుకుని రోజూ ఉదయం పూట తాగుతుండాలి. మిరపకాయ, జీలకర్ర, అల్లం కలిపిన డ్రింక్‌తో శరీరం మెటబోలిజం వేగవంతం చేయవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గించడంలో దోహదమౌతుంది.
సహజసిద్ధమైన పదార్ధాలతో చేసే ఈ డ్రింక్స్ రోజూ ఉదయం వేళ తాగడంతో పాటు పరిమితంగా వ్యాయామం లేదా వాకింగ్ చేస్తుంటే కచ్చితంగా అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also read: Diabetes Tips: మీ డైట్‌లో ఈ 5 పచ్చి కూరగాయలుంటే చాలు..డయాబెటిస్ ఎంతున్నా ఇట్టే మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook