Benefits Of Turmeric And Honey: తేనె, పసుపు ఈ రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యతను పొందిన పదార్థాలు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. సహజ లాక్సేటివ్‌గా పనిచేసి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపులోని కర్కుమిన్, తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని మంటను తగ్గించి, యంత్రణను నివారిస్తుంది. చర్మ వ్యాధులను తగ్గించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కీళ్ల వాపు, నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
చలికాలం వస్తే చాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు మనల్ని వేధించడం మొదలవుతుంది. ఈ సమయంలో మన శరీరాన్ని రోగ నిరోధక శక్తిని పెంచడానికి అనేక ఇంటి నివారణలు ఉన్నాయి. వాటిలో తేనె, పసుపు చాలా ప్రసిద్ధమైనవి.
తేనె, పసుపు ఎందుకు ప్రత్యేకం?
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: తేనెలోని హైడ్రోజన్ పెరాక్సైడ్, పసుపులోని కర్కుమిన్ శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేసి, వాపును తగ్గిస్తాయి.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: తేనె, పసుపు రెండూ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇది శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా దాడుల నుంచి రక్షిస్తుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది: తేనె, పసుపు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
దగ్గు, జలుబు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది: తేనె గొంతును ప్రశాంతంగా ఉంచుతుంది, పసుపు వాపును తగ్గిస్తుంది.
తేనె, పసుపు మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి?
తయారీకి కావలసినవి:
పసుపు పొడి
తేనె
మిరియాల పొడి
నిమ్మరసం
తయారీ విధానం:
పసుపు పొడి, తేనె, మిరియాల పొడిని (మీరు వాడాలనుకుంటే) ఈ బౌల్ లో వేసుకోండి. ఈ మూడు పదార్థాలను బాగా కలిపే వరకు మెల్లగా కలపండి. మిశ్రమం మృదువుగా, స్మూత్‌గా ఉండే వరకు కలపండి. కాస్త పులుపు తీపి రుచి కోరుకుంటే, ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మీరు నేరుగా తీసుకోవచ్చు లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. దీని ఉపయెగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది. అలాగే రెండిటి అధికంగా తీసుకోవడం మంచిది కాదు.
గమనిక: ఈ మిశ్రమం ఏదైనా అనారోగ్య సమస్యకు చికిత్సగా పరిగణించకూడదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe Twitter, Facebook
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.