C.D.Criminal or Devil Movie Review: అదాశర్మ సి.డి. క్రిమినల్ Or డెవిల్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

C.D.Criminal or Devil Movie Review: అదా శర్మ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గతేడాది 'ది కేరళ స్టోరీ' మూవీతో ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు 'బస్తర్' మూవీతో పలకరించింది. తాజాగా చాలా యేళ్ల తర్వాత తెలుగులో 'క్రిమినల్ ఆర్ డెవిల్' మూవీతో పలకరించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : May 24, 2024, 10:03 AM IST
C.D.Criminal or Devil Movie Review: అదాశర్మ సి.డి. క్రిమినల్ Or డెవిల్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

C.D.Criminal or Devil Movie Review: అదా శర్మ తెలుగులో యాక్ట్ చేసి చాలా యేళ్లే అవుతోంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో విశ్వంత్ హీరోగా నటించిన చిత్రం C.D క్రిమినల్ ఆర్ డెవిల్. ఈ మూవీకి కృష్ణ అన్నం డైరెక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.మరి ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
సిద్దు (విశ్వంత్) అమ్మానాన్నలు ఊరికి వెళ్తే ఇంట్లో ఒక్కడే  ఉండాల్సి వస్తుంది. సిద్దు ఇంట్లో పని మనిషి (జబర్దస్త్ రోహిణి) అప్పుడప్పుడు వచ్చి ఇంట్లో పనులు చేస్తూ వెళులోంది. అసలే బిడియస్తుడు అయిన సిద్దుకు  దెయ్యాలు అంటే చాలా భయం. ఇక సిద్దు ఇంట్లో సింగిల్‌గా  ఉన్న ఆ టైంలోనే డెవిల్ అనే దెయ్యం సినిమా చూసి భయపడుతుంటారు. సినిమా చూస్తుంటే అందులోని దెయ్యం వచ్చి తననే చంపేస్తోందని భయపడుతుంటాడు. ఇలా సిద్దు ఇంట్లో లోన్లీగా ఉన్న సమయంలోనే  అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ లేడీ సైకో రక్ష (అదా శర్మ) బయట అందరిలోనూ ఓ భయాన్ని క్రియేట్ చేస్తుంది. పోలీసులు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఐ విల్ కిల్ యూ అని రాస్తూ మరీ
అందరినీ కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. ఆ సైకో రక్ష  విశ్వంత్  ఇంటికి వస్తుంది. ఆ తర్వాత సైకోకకు విశ్వంత్ మధ్య ఏం జరిగింది. అసలు విశ్వంత్‌కి ఉన్న సమస్య ఏంటి? రక్షగా అదా శర్మ ఎందుకు వచ్చింది? అసలు అమ్మాయిల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తుంది ? చివరకు పోలీసులు ఏం చేశానరన్నదే మిగిలిన కథ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
సి.డి సినిమా కోసం దర్శకుడు రాసుకున్న పాయింట్ వెరైటీగా ఉంది. హారర్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలను కలగలపి ఈ కథను రాసుకున్నాడు. అయితే ఈ సినిమా మొత్తం ఒకే చోట జరుగుతుంది. దీంతో కథలో అంతగా ముందుకు సాగుతున్నట్టుగా అనిపించదు. కానీ ఇలాంటి తరహా కథల్లో సస్పెన్స్ కీ రోల్ పోషిస్తాయి. అదే ఫార్ములాను ఈ సినిమా కోసం అప్లై చేసాడు దర్శకుడు. సినిమాల్లో అక్కడక్క కొన్ని లాజిక్ లేని సీన్స్ కనిపిస్తాయి. కానీ అవి ఎందుకు పెట్టాడనేది సినిమా చివర్లో తెలుస్తుంది. మరోవైపు ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్ ఏమవుతుందో అని ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగేలా చేయడంలో సక్సెస్ సాధించాడు. ఇక ఇంటర్వెల్ తర్వాత హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్ని వేశాలు కొన్ని రొమాంటిక్‌గా అనిపిస్తే.. ఇంకొన్ని సార్లు హారర్ ఎలిమెంట్స్‌ని తలపిస్తాయి. ఇక మధ్య మధ్యలో రోహిణి పాత్ర చేసే కామెడీ నవ్విస్తుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. నగరంలో అమ్మాయిల మిస్సింగ్‌ విషయంలో చివరన ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎండింగ్‌లో అందరూ ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.

సి.డి సినిమాకు ప్రధాన నేపథ్య సంగీతం. మూడ్‌కు తగ్గట్టుగా నవ్వించి, కవ్వించి భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చక్కగా ఉంది. తక్కువ లొకేషన్లలో సినిమా తీసి మంచి అవుట్‌ను నిర్మాతకు అందించారు. ఈ మూవీ మరీ ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్‌ను కట్టి పడేసేలా ఉంది.

నటీనటులు
అదా శర్మ ఎంత మంచి నటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో రక్ష పాత్రలో అదా శర్మ అందరినీ భయపెట్టింది. ఆమె చూపుల్తోనే అందరిలోనూ వణుకు పుట్టించేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేస్తుంది. ఇక విశ్వంత్ అయితే తన వేరియేషన్స్ చూపించాడు. విశ్వంత్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇక ఇందులో రోహిణి అప్పుడప్పుడు కనిపించి తెగ నవ్వించేస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా భరణి మెప్పిస్తాడు. ఇక మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్

సినిమాటోగ్రఫీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

ఎడిటింగ్

లాజిక్ లేని సీన్స్

రేటింగ్ 3/5

Trending News