Aha: ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఇంద్రజిత్ సుకుమారన్ 'ఆహా' మూవీ..

Aha Movie Streaming on Aha: ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కె. జయన్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళం  స్పోర్ట్స్ డ్రామా మూవీ 'ఆహా'. ది బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 13, 2024, 04:20 PM IST
Aha: ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతున్న  ఇంద్రజిత్ సుకుమారన్ 'ఆహా' మూవీ..

Aha Movie Streaming on Aha:  ఇంద్రజిత్ సుకుమారన్ మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అన్న. ఈయన కూడా బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆపై నటుడిగా హీరోగా మలయాళ సినీ ఇండస్ట్రీలో సత్తా చూపెడుతున్నారు. అటు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీలో ఈయన జర్నలిస్ట్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఈ సినిమాలో ఈయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు మలయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే హీరోగా సత్తా చూపెడుతూనే ఉన్నాడు. తాజాగా ఈయన మలయాళంలో 2021లో  హీరోగా నటించిన ‘ఆహా’మూవీని తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా డబ్ చేసారు. తెలుగులో ‘ఆహా’పేరుతో డబ్బై మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

Zsa Zsa ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రేమ్ అబ్రహం నిర్మించిన ఈ మూవీనిక సయనోరా ఫిలిప్, షియాద్ కబీర్ సంగీతం అందించారు. 1980, 1990లలో బాగా పాపులర్ అయిన  ‘టగ్ ఆఫ్ వార్ టీమ్’ నుండి ప్రేరణ పొందిన రూపొందిన ఈ చిత్రం అందరి మెప్పు పొందింది. తెలుగు, హిందీ సహా దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్ లో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో 1980. 90ల నాటి విలేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇపుడు భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇంద్రజిత్ సుకుమారన్ ..‘మారు విలన్ గోపరంగల్’ మూవీతో పలరించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది. మరోవైపు ఈయన చేతిలో పలు క్రేజీ ప ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News