C 202 Movie Review: C 202 మూవీ రివ్యూ.. హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించిందా..!

C 202 Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ లో దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ‘C 202’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది చూడాలి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 25, 2024, 03:36 PM IST
C 202 Movie Review: C 202 మూవీ రివ్యూ.. హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించిందా..!

మూవీ రివ్యూ: సీ 202 (C 202 )

నటీనటులు: మున్నాకాశి, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, అర్చన, చిత్రం శ్రీను, సత్య ప్రకాష్, షఫీ, వై. విజయ షరూన్ రియా ఫెర్నాండెస్, డ్రీమ్ అంజలి తదితరులు

సినిమాటోగ్రఫీ: సీతారామరాజు ఉప్పుతల

నిర్మాణం: మై టీ ఓక్ పిక్చర్స్

నిర్మాత: మనోహరి కెఏ

కథ స్క్రీన్ ప్లే మ్యూజిక్ ఎడిటర్ డైరెక్టర్ : మున్నాకాశి

విడుదల తేది: 25-10-2024

మున్నా కాశీ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తూ ఎడిటింగ్, దర్శకత్వం వహించిన చిత్రం ‘C 202'. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మాతగా  నిర్మిస్తూన్న చిత్రం ‘సి 202’.  సస్పెన్స్  హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే :
C 202 కథ విషయానికొస్తే..C 202 అనే ఇంట్లో ఒక హత్య జరుగుతుంది. ఎవరో చేతబడి చేయడం వల్ల ఒక అమ్మాయి చనిపోవడం జరగుతుంది. దాని వెనక ఓ భూతాల రాజు (తనికెళ్ల భరణి)గా పేరొందిన ఒక  వశీకరణం చెందిన ఓ వ్యక్తి ఉంటాడని తెలుస్తోంది. అసలు అతను ఎందుకు ఆ ఇంటి మనుషులను ఎందుకు  చేతబడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నాడు.   అసలు ఆ ఇంట్లో గతంలో ఎవరు ఉన్నారు. అతను చేతబడి వెనక ఉన్న కారణాలు ఏమిటి? ఆ ఇంట్లో ఏముంది..? ఆ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను ఎవరు తరిమేశారనే విషయం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ఇలాంటి హార్రర్ కథలకు కథ కంటే కథనం ఇంపార్టెంట్. ఇలాంటి చిత్రాలను స్క్రీన్ ప్లే పరంగా దర్శకుడు మంచి బిగువైన కథనంతో ప్రేక్షకులను కుర్చీలోంచి కదలనీయకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు. కథను సెలెక్ట్ చేసుకోవడమే కాదు.. దాన్ని ఎక్స్ క్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా.. ఎడిటర్ గా.. మ్యూజిక్ పరంగా అన్నింట తనదైన ముద్ర వేసాడు. నిర్మాత మనోహరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

నటీనటుల విషయానికొస్తే..
మున్నాకాశి, షరూన్ రియా ఫెర్నాండెస్  మంచి నటనకనబరిచారు. భయపడి భయపెట్టే క్యారెక్టర్లలో మంచి నటనను కనబరిచారు. భూతాల రాజు గా తనికెళ్ల భరణి నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సత్య ప్రకాష్, షఫీ, వై. విజయ వాళ్ల పరిధి మేరకు నటించారు.  

ప్లస్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కథ, కథనం
నటీనటుల నటన

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
రన్ టైమ్
సెకండాఫ్

పంచ్ లైన్.. ‘C 202 హార్రర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్ :2.5/5

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

Trending News