Rahul Gandhi Plea: స్టే ఇవ్వాలని కోర్టును కోరిన రాహుల్ గాంధీ.. తిరిగి పెద్ద షాకిచ్చిన సూరత్ కోర్టు?

2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీని ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలే అంటూ బాగా ఘాటుగా విమర్శలు చేసిన సంగతి.. గుజరాత్ లోని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ప్రకటించింది. ఆ తీర్పు గురించి స్టే ఇవ్వాలి అని సూరత్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తాజాగా మరోసారి విచారణ జరగగా..  రాహుల్ కోరిన విజ్ఞప్తిని సూరత్ కోర్టు కొట్టేసింది. 

Last Updated : Apr 20, 2023, 02:59 PM IST
Rahul Gandhi Plea: స్టే ఇవ్వాలని కోర్టును కోరిన రాహుల్ గాంధీ.. తిరిగి పెద్ద షాకిచ్చిన సూరత్ కోర్టు?

Surat Court Rejects Rahul Gandhi Plea: రాహుల్ గాంధీకి తాజాగా సూరత్ కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏంటంటే.. 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీని ఉద్దేశించి.. మోడీ ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలే అంటూ బాగా ఘాటుగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల గుజరాత్ లోని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ప్రకటించింది. అంతేకాకుండా రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఎంపీగా లోక్ సభ సభ్యత్వాన్ని కూడా తొలగించింది సూరత్ కోర్టు.

దీంతో రాహుల్ ఇప్పుడు ఆ తీర్పు గురించి స్టే ఇవ్వాలి అని సూరత్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తాజాగా మరోసారి విచారణ జరిగింది. ఇక విచారణ అనంతరం రాహుల్ కోరిన విజ్ఞప్తిని సూరత్ కోర్టు కొట్టేసింది. ఈ విషయం అందరి దృష్టిలో పడటంతో.. ఇక రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరణ విషయంలో దారులు లేవని భావిస్తున్నారు.

ఇక తనపై పరువు నష్టం వ్యాఖ్యల కేసులో దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పు స్టే గురించి వెళ్ళినందుకు కోర్టు మాత్రం అంగీకరించలేకపోయింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్ సభ్యత్వం పై ప్రభావం పడుతుందని ఈరోజు సూరత్ కోర్టు దృష్టికి వచ్చాడు రాహుల్ గాంధీ. కానీ కోర్టు మాత్రం ఆయన వాదనలను కొట్టి పారేసింది.

Also Read: Atiq Ahmed, Ashraf’s Murder Case: ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు.. అందరూ ఆ పోలీస్ స్టేషన్ సిబ్బందే

దీంతో తర్వాత ఏం జరుగుతుందో అని అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ తర్వాత ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఆసక్తిగా మారింది. అంటే సూరత్ కోర్టు తీర్పుపై తిరిగి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఆశ్రయించి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడి విచారణ పూర్తయి ఎందుకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read: Digital Highways: రహదారులకు కొత్తరూపు.. హైదరాబాద్-బెంగుళూరు కారిడార్‌లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News