Varudu Heroine : బన్నీని వదిలిపెట్టని వరుడు హీరోయిన్.. అందుకే అల్లు అర్జున్ బ్లాక్ చేశాడా?

Bhanu Sri Mehra Video Request భాను శ్రీ మెహ్రా ఇప్పుడు పనీ పాట ఏం లేకుండా కేవలం యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలను చూడమని బన్నీని తాజాగా ట్యాగ్ చేసింది. ఇలా విసిగిస్తుందనే బన్నీ ఆమెను బ్లాక్ చేసి ఉంటాడని కామెంంట్లు వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 09:13 PM IST
  • నెట్టింట్లో బన్నీ హీరోయిన్ రచ్చ
  • వరుడు హీరోయిన్‌పై ట్రోల్స్
  • భానుశ్రీ మెహ్రా అతి చేష్టలు
Varudu Heroine : బన్నీని వదిలిపెట్టని వరుడు హీరోయిన్.. అందుకే అల్లు అర్జున్ బ్లాక్ చేశాడా?

Bhanu Sri Mehra Video Request వరుడు హీరోయిన్ భాను శ్రీ మెహ్రీ గత కొన్ని రోజులుగా వార్తల్లో ట్రెండ్ అవుతోంది. ఆమెను బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ తనను బ్లాక్ చేశాడంటూ.. వాపోతూ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. దీంతో బన్నీ అభిమానులు ఆమె మీద విరుచుకుపడ్డారు. అయితే మళ్లీ వెంటనే బన్నీ కూడా ఆమెను అన్ బ్లాక్ చేశాడు. దీంతో ఆమె సంబరపడిపోయింది. తాను ఎప్పటికీ బన్నీ అభిమానినే అని మళ్లీ కవర్ చేసుకుంది.

అయితే ఇప్పుడు బన్నీని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ వేసింది. బన్నీ దసరా సినిమాను మెచ్చుకుంటూ వేసిన ట్వీట్ అందరికీ తెలిసిందే. గత వారం బన్నీ ఆ ట్వీట్ వేస్తూ.. ఆ ట్వీట్‌కు వరుడు హీరోయిన్ రిప్లై ఇస్తూ.. తన కొత్త వీడియోను చూడమని ట్యాగ్ చేసింది. దీంతో బన్నీ అభిమానులకు కాలిపోయింది. మళ్లీ భాను శ్రీని ట్రోల్ చేయడం ప్రారంభించారు.

 

నీకు పని పాట లేకపోతే.. మా హీరోకు ఉండదా? నీ వీడియోలు చూసుకుంటూ కూర్చోవాలా? నీకు అసలు బ్రెయిన్ ఉందా? నిన్ను అందుకే బ్లాక్ చేసి ఉంటాడు.. ఇలా వీడియోలు చూడమని రిక్వెస్ట్‌లు పెట్టడం, నొటిఫికేషన్లు వస్తుండటంతోనే నిన్ను బ్లాక్ చేసి ఉంటాడు.. నిన్ను బ్లాక్ చేసే మంచి పని చేశాడంటూ ఇలా నానా రకాలుగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

భాను శ్రీ మెహ్రా ప్రస్తుతం యూట్యూబ్‌ మీదే ఆధారపడి ఉందన్న సంగతి తెలిసిందే. భాను శ్రీ చేసిన వరుడు సినిమా డిజాస్టర్ అయింది.. ఆ తరువాత చేసిన సినిమాలు కూడా ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో సినిమా రంగాన్ని వదిలింది. పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అయింది. ఇప్పుడు ఇలా యూట్యూబ్ వీడియోలతో సందడి చేస్తోంది. అయితే ఈ యూట్యూబ్ వీడియోలకు మాత్రం అంతగా ఆదరణ దక్కడం లేదు.

Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News