MP Avinash Reddy Bail Petition: ముందస్తు బెయిల్ ఇవ్వలేం.. అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana High Court On MP Avinash Reddy Anticipatory Bail Petition: ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పును జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 28, 2023, 06:30 PM IST
MP Avinash Reddy Bail Petition: ముందస్తు బెయిల్ ఇవ్వలేం.. అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana High Court On MP Avinash Reddy Anticipatory Bail Petition: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం మరోసారి రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పు ఇవ్వడం కుదరదని తెలిపింది. తుది తీర్పు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న న్యాయస్థానం.. సుప్రీం కోర్టు ఉత్వర్వులు నేపథ్యంలో తాము కలగజేసుకోలేమని పేర్కొంది. శనివారం నుంచి హైకోర్టు సెలవుల నేపథ్యంలో వెకేషన్ తరువాత తీర్పు ఇస్తామని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు వాదనలు వినాలని కోర్టు మీద ఒత్తిడి చేయొద్దని సూచించింది.

ఈ కేసులో అర్జెన్సీ ఉందని ఇరుపక్షాల లాయర్లు కోరగా.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు అన్ని రోజులు రిజర్వ్‌లో పెట్టడం బాగుండదని ధర్మాసనం అభిప్రాయ పడింది. అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని సూచించింది. అర్జెన్సీ అయితే.. కేసును వెకేషన్‌ బెంచ్‌కు మార్చుకోవచ్చని పేర్కొంది. చీఫ్‌ జస్టిస్ ముందు అర్జెన్సీ ఉందని చెబితే.. నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. 

ఈ కేసులో సీబీఐ తన పని తాను చేసుకోవచ్చా..? అని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది అడగ్గా.. ప్రస్తుతం ఈ వ్యవహారంలో తాము కలుగజేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ తేలేవరకు ఎలాంటి  చర్యలు తీసుకోకుండా ఆపాలని అవినాష్‌ రెడ్డి తరుపున న్యాయవాది కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని.. సీబీఐ విచారణ చేసుకోవచ్చని తెలిపింది. కనీసం రెండు వారాలైనా సీబీఐ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌ రెడ్డి లాయర్లు కోరగా.. ఈ విషయంలో సీబీఐకి తాము ఉత్వర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం ఉత్కంఠ మరింత పెరిగింది. ఇరు పక్షాలు అడుగులు ఎటువైపు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఎమర్జెన్సీ దృష్ట్యా సీజే ఎదుట మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సీబీఐ అధికారులు కూడా మరింత వేగం పెంచే ఛాన్స్ ఉంది.  

Also Read: Chandrababu Naidu: యుగానికి ఒక రాక్షసుడు జగన్.. అందుకే ఈ దుర్మార్గుడు పుట్టాడేమో.. చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు  

Also Read: Jr NTR TDP: నారా లోకేష్‌ పది పాదయాత్రలు చేసినా వేస్ట్.. టీడీపీకి లీడర్ జూనియర్ ఎన్టీఆరే.. వైసీపీ ఎమ్మెల్యే   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News