Nayanthara : త్రివిక్రమ్ డైలాగ్‌ను చెప్పినట్టుందే?.. విఘ్నేష్‌కు నయన్‌ సలహా ఇదేనట

Nayanthara Motivates Vignesh Shivan విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. ఇక నయన్‌కు సంబంధించిన అప్డేట్లన్నీ కూడా విఘ్నేశ్ ఇవ్వాల్సిందే. నయన్ సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోదు. ఆమెకు సోషల్ మీడియాలో ఖాతాలు కూడా లేవు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2023, 09:56 AM IST
  • నెట్టింట్లో విఘ్నేశ్ శివన్ పోస్ట్ వైరల్
  • భార్య నయన్ ఇచ్చిన సలహా ఇదేనట
  • చెప్పే టైం, చెప్పే వ్యక్తి అంటూ డైలాగ్
Nayanthara : త్రివిక్రమ్ డైలాగ్‌ను చెప్పినట్టుందే?.. విఘ్నేష్‌కు నయన్‌ సలహా ఇదేనట

Nayanthara Motivates Vignesh Shivan విఘ్నేశ్ శివన్‌కు ఇప్పుడు టైం కలిసి వస్తున్నట్టుగా లేదు. అజిత్ కుమార్‌తో తీయాల్సిన సినిమా క్యాన్సిల్ అయింది. అజిత్‌తో సినిమా ఉంటుందని విఘ్నేశ్ సంబరపడిపోయాడు. కానీ చివరకు ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు విఘ్నేశ్‌ ఇంకో ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకోలేకపోతోన్నాడు. అయితే ఇప్పుడు విఘ్నేశ్‌కు నయన్ ధైర్యాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. భార్యతో ఇలా ముచ్చట్లు పెట్టానని, తాను ఇలా చెప్పిందంటూ విఘ్నేశ్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

మంచి విషయాలే గురించే ఆలోచించు.. ఫోకస్ పెట్టు.. అన్నీ మంచే జరుగుతాయ్ అని నయన్ సలహా ఇచ్చినట్టుంది. దీంతో విఘ్నేశ్ ఇలా స్పందించాడు. భార్యతో ఇలా మామూలుగా మాట్లాడుతూ ఉంటే.. అలా ఓ ఫిలాసఫీ చెప్పింది.. సరైన వ్యక్తి నుంచి.. సరైన టైంలో వచ్చే మాటల ప్రభావం వేరేలా ఉంటుంది.. వాటిని మనం వినాల్సిందే.. సముద్రం, అలలు అనేవి ఇక్కడ బోనస్‌గా ఉన్నాయి.. అంటూ తన భార్య ఇచ్చిన సలహా గురించి విఘ్నేశ్ చెప్పుకొచ్చాడు.

నయన్‌కి కూడా ఇప్పుడు సరైన హిట్ లేదు. తమిళంలో ఇప్పుడు నయన్‌కు క్రేజీ ప్రాజెక్ట్‌లంటూ ఏమీ లేవు. తెలుగులో అయితే నయన్‌ను ఎవ్వరూ రిఫర్ చేయడం లేదనిపిస్తుంది. గాడ్ ఫాదర్ సినిమాతో నయన్‌కు ఒరిగిందేమీ లేదు. ఇక ఇప్పుడు ఆమె షారుఖ్ ఖాన్ సినిమాలో నటిస్తోంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న జవాన్ సినిమాలో షారుఖ్ సరసన కనిపించనుంది.

Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్

పఠాన్‌లో దీపిక పదుకొణె వేసుకున్నట్టుగా ఓ బికినీని జవాన్‌లో నయన్ కూడా వేసుకోబోతోన్నట్టు టాక్ వినిపించింది. అయితే నయన్ బికినీలు, ముద్దు సీన్లకు దూరంగా ఉండి చాలా కాలమే అయింది. అట్లీ కోసమో, షారుఖ్ కోసమో ఏమో గానీ ఆ సీన్లకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు నయన్ విఘ్నేశ్‌లు తమ కవల పిల్లలలో సంతోషంగా ఉన్నారు. విఘ్నేశ్ శివన్ అయితే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.

Also Read:  Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News