సోమవారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. ఈ సంద్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన సభ్యుల ప్రశ్నలకు జవాబిస్తూ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై 1.2 లక్షల ఖర్చుతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని వెల్లడించారు.
తీరు మార్చుకోవాలని ప్రతిపక్షాలకు సూచన..
సోమవారం అసెంబ్లీలో రైతు సమ్యస్యలపై గందరోగళం నెలకొన్న నేపపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలో సభ్యులు స్థాయి, గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా మాట్లాడాలని కోరారు. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.