PIB Fact Check On Kanya Sumangala Yojana: ఆడపిల్లల భవిష్యత్ కోసం.. వారి ఉన్నత చదువులకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకాల మాటు కొందరు ఫేక్ రాయుళ్లు దుష్ప్రచారానికి తెరలేపుతున్నారు. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.4500 అందుతాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఈ మెసెజ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రభుత్వం నుంచి నిజంగా డబ్బులు వస్తాయా..? అంటూ ఆడపిల్లల తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ట్వీట్‌లో పోస్ట్ పెట్టింది. 'సర్కారీ వ్లాగ్' అనే యూట్యూబ్ ఛానెల్ 'కన్యా సుమంగళ యోజన' కింద కుటుంబాలలో కుమార్తెలు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.4,500 ఇస్తోందని వీడియోను చేసి పోస్ట్ చేసిందని తెలిపింది. ఈ వార్త పూర్తి ఫేక్ అని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి పథకం అమలు చేయడం లేదని పేర్కొంది. ప్రజలు ఎవరూ ఈ వీడియోను నమ్మొద్దని కోరింది. ఇలాంటి ఫేక్ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాస్తవానికి కన్యా సుమంగళ యోజన అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకం. కన్యా సుమంగళ యోజన 2023 కింద ఒక కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లల సంరక్షకులు లేదా తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకాన్ని యోగి ప్రభుత్వం 25 అక్టోబర్ 2019న లక్నోలో ప్రారంభించింది. ఈ పథకం కింది యూపీలోని ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది.
ఈ పథకాన్ని బేస్ చేసుకుని ఫేక్ రాయుళ్లు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుందంటూ దుష్ప్రచారానికి తెరలేపారు. అలాంటి మెసేజ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే.. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే సంప్రదించాలని సూచించింది. ఇలాంటి ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలని పేర్కొంది. అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండని చెప్పింది. మీరు ఏదైనా వైరల్ మెసేజ్ నిజమో కాదో తెలుసుకోవాలంటే.. మొబైల్ నంబర్ 918799711259 లేదా socialmedia@pib.gov.in కు మెయిల్ చేసి తెలుసుకోవచ్చని సూచించింది. ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also Read: Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా..
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook