Chennai Super Kings Captain MS Dhoni teased Pacer Deepak Chahar: ఐపీఎల్ 16 సీజన్‌లో భాగంగా బుధవారం రాత్రి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (24), శివం దూబే (25), అంబటి రాయుడు (23), ఎంఎస్ ధోనీ (20) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 3 వికెట్స్ పడగొట్టగా.. అక్షర్ పటేల్ రెండు వికెట్స్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచులో ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. బౌలర్ దీపక్ చహర్‌ను ఆటపట్టించాడు.
చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య టాస్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. మైదానంలో అతడికి చెన్నై పేసర్ దీపక్ చహర్ కనిపించాడు. మహీ నడుచుకుంటూ వెళుతూ చహర్ వైపు సీరియస్ లుక్స్ ఇచ్చాడు. ఇదేమి పట్టించుకోని చహర్ మరో ఆటగాడితో మాట్లాడుతున్నాడు. చహర్ వెనకాలకు వచ్చిన ధోనీ.. పక్క నుంచి వెళుతూ దీపక్ తలపై కొట్టినంత పని చేశాడు. ధోనీ పనితో ఆశ్చర్యానికి గురైన చహర్.. మహీ వైపు తిరిగాడు. సీఎస్‌కే కెప్టెన్ ధోనీ అతని వైపు చూడకుండా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ఫాన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
ఐపీఎల్ 2023లో దీపక్ చహర్ పెద్దగా ఆకట్టుకోలేదు. గాయంతో తొలి అంచె పోటీలకు చహర్ దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండో అంచె పోటీల్లో చహర్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన చహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది కాబట్టి.. చహర్ కీలకంగా మారే అవకాశం ఉంది. 16వ సీజన్లో చెన్నై 11 మ్యాచ్‌లు ఆడి ఆరింట్లో గెలిచి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన మూడు మ్యాచులలో కనీసం రెండు గెలిచినా ధోనీ జట్టు ప్లే ఆఫ్స్ చేరుతుంది.
తుది జట్లు ఇవే:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/ కీపర్), శివమ్ దూబె, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, రిలీ రొసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.
సబ్‌స్టిట్యూట్ ప్లేయర్స్:
ఢిల్లీ క్యాపిటల్స్: ముఖేష్ కుమార్, మనీష్ పాండే, ప్రవీణ్ దూబే, అభిషేక్ పోరెల్, చేతన్ సకారియా.
చెన్నై సూపర్ కింగ్స్: మతీషా పతిరనా, సుభ్రాంశు సేనాపతి, మిచ్ సాంట్నర్, ఆకాష్ సింగ్, షేక్ రషీద్.
Also Read: 2023 World Cup Schedule: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్.. భారత్ తొలి పోరు ఎవరితోనో తెలుసా?
Also Read: Karnataka Exit Poll 2023 Live: ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.