Sunisith: చరణ్ ఫాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న సునిషిత్ మమూలోడేమీ కాదు..ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?

Sriramoju Sunisith Bio Data: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ అవుతున్న సునిషిత్ శ్రీరామోజు అనే ఒక వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏమీ చిన్నది కాదని అంటున్నారు సన్నిహితులు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : May 14, 2023, 10:25 PM IST
Sunisith: చరణ్ ఫాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న సునిషిత్ మమూలోడేమీ కాదు..ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?

Sriramoju Sunisith Background : గత కొంతకాలంగా సునిషిత్ శ్రీరామోజు అనే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నాచితకా యూట్యూబ్ ఛానల్స్ మొదలు కాస్త పేరు ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా మనోడు ఇంటర్వ్యూల కోసం ఎగబడి మరి ఇంటర్వ్యూలు చేసి పబ్లిష్ చేస్తున్నారు.

నిజానికి ఈ వ్యక్తికి సినీ పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదు కానీ తనకు సినీ పరిశ్రమలో అన్యాయం జరిగిందని తనకు రావాల్సిన అవకాశాలను ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వాళ్ళు తన్నుకుపోయారని వాళ్ళ మీద సంచలన ఆరోపణలు గుప్పిస్తూ ఉంటాడు సునిషిత్. కొన్నాళ్ల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాను ప్రేమించుకున్నామని ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనను వదిలేసిందని సునిషిత్ ఆరోపణలు చేశాడు. అంతేకాదు తాము ఇద్దరం రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని అప్పట్లో సునిషిత్ కామెంట్ చేయగా విసిగిపోయిన లావణ్య త్రిపాఠి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్టు కూడా చేశారు.

Also Read: The Kerala Story: 9 రోజుల్లో 100 కోట్లు కొల్లగొట్టిన ది కేరళ స్టోరీ

తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అతని మానసిక పరిస్థితి బాలేదని చెప్పి వదిలేశారు. ఇక ఈ మధ్య రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి సునిషిత్ చేసిన కామెంట్లు వైరల్ అవ్వడంతో అతనికి బుద్ధి చెప్పాలని భావించిన రాంచరణ్ అభిమానులు దేహశుద్ధి చేశారు. అయితే వాస్తవానికి సునిషిత్ మామూలోడు ఏమీ కాదు పెద్ద చదువులే చదివాడు. కానీ ఎందుకో ఇలా తయారయ్యాడు అంటున్నారు సన్నిహితులు. వరంగల్ లో పుట్టి పెరిగాడు సునిషిత్.

ఇక సునిషిత్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్ లో మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ చేసాడు. ఇక వరంగల్లోని వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశాడు. అంతేకాక దాదాపుగా ఏడు ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ చేయగా, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మూడు పేపర్లు ప్రజెంట్ చేశాడు. అంతేకాదు సునిషిత్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి రివ్యూయర్ కూడా ఉన్నాడు, ఇక చివరిగా ఆయన గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశారు. అయితే తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఇలా మీడియాకి ఎక్కి వివాదాస్పదమయ్యాడు. 

Also Read: Puri Jagannadh Next Movie: లైగర్ డిజాస్టర్ తరువాత రామ్ తో పూరీ సినిమా.. ఈ సారి ఏమవుతుందో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News