GT Skipper Hardik Pandya says You need to be a proper devil to hate CSK Captain MS Dhoni: ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs GT IPL 2023 Qualifier 1) తలపడనున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళుతుంది. ఓడిన జట్టుకు మాత్రం క్వాలిఫయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్ 2తో సంబంధం లేకుండా తుది మెట్టుకు చేరుకోవాలని గుజరాత్, చెన్నై జట్లు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ అండతోనే పాండ్యా భారత జట్టుకు కీలకంగా మారిన విషయం తెలిసిందే. నేడు క్వాలిఫయర్ 1 మ్యాచ్ సందర్భంగా ధోనీపై హార్దిక్ ప్రశంసలు కురిపించాడు. తాను ఎప్పుడూ ధోనీ అభిమానినే అని పేర్కొన్నాడు. కీలక మ్యాచ్ నేపథ్యంలో 'కెప్టెన్.. లీడర్.. లెజెండ్.. ఎంఎస్ ధోనీ ఓ ఎమోషన్’ అని గుజరాత్ టైటాన్స్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఇందులో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. 'చాలా మంది ఎంఎస్ ధోనీ చాలా సీరియస్‌గా ఉంటాడనుకుంటారు. నేను మాత్రం అతడితో చాలా సరదాగా ఉంటా. జోక్‌లు కూడా వేస్తాను. ధోనీ లాగా ఎప్పుడూ అతడిని చూడను' అని అన్నాడు.
'నిజం చెప్పాలంటే నేను చాలా విషయాలు ఎంఎస్ ధోనీ నుంచి నేర్చుకున్నాను. మహీతో ఎక్కువగా మాట్లాడకపోయినా.. కేవలం చూస్తూనే ఎన్నో సానుకూల అంశాలు నేర్చుకున్నా. నాకు ధోనీ బెస్ట్ ఫ్రెండ్. అంతేకాదు నా ప్రియమైన సోదరుడు. ధోనీతో చిలిపి పనులు చేసేవాడిని. అతడు కూడా చాలా ఫన్నీగా ఉండేవాడు. నేను ఎప్పుడూ ఎంఎస్ ధోనీ అభిమానినే. మహీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోనీని ఎవరైనా ద్వేషించాలంటే వారు చాలా చాలా క్రూరులై ఉండాలి' అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ధోనీతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ హార్దిక్ భావోద్వేగానికి లోనయ్యాడు.
తాను గుజరాత్ టైటాన్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన సమయంలోనూ ఎంఎస్ ధోనీ తనకు రోల్ మోడల్ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. మహీ అడుగుజాడల్లో నడుస్తూ మంచి కెప్టెన్‌గా పేరు తెచ్చుకుంటానని చెప్పాడు. మరి హార్దిక్ తన గురువుని మించిపోతాడో లేదో చూడాలి. ఇప్పటికే ఓ ఐపీఎల్ టైటిల్ గెలిచిన హార్దిక్.. రెండో ట్రోఫీపై కన్నేశాడు. మహీ ప్రణాళికల ముందు హార్దిక్ తేలిపోతాడో? లేదా నిలుస్తాడో? చూడాలి.
Also Read: GT vs CSK Qualifier 1: చెన్నైతో గుజరాత్ మ్యాచ్.. ధోనీ సేనకు గిల్ వార్నింగ్!
Also Read: Virat Kohli: థ్యాంక్యూ బెంగుళూరు.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.