Bank of Baroda UPI Facility: తమ కస్టమర్లకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతా తీపి కబురు అందించింది. కస్టమర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ICCW) సదుపాయాన్ని ప్రారంభించింది. ఇక నుంచి యూపీఐను ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా సౌకర్యాన్ని కల్పిస్తున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకు తమదేనని బీఓబీ వెల్లడించింది. ఐసీసీడబ్యూ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని.. బీఓబీ వరల్డ్ యూపీఐ, BHIM UPI, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా డబ్బులు ఏటీఎంల నుంచి తీసుకోవచ్చని తెలిపింది.
ఇక నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే కస్టమర్లు డెబిట్ కార్డ్‌ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. బీఓబీ ఏటీఎంకి వెళ్లిన తరువాత యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకోండి. విత్‌డ్రా చేయాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయండి. ఆ తరువాత ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ డిస్ ప్లే అవుతుంది. మీ మొబైల్‌ను నుంచి ఏదైనా యూపీఐ యాప్‌ను ఉపయోగించి కోడ్‌ను స్కాన్ చేయండి. అంతే మీకు ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేస్తాయి.
ఐసీసీడబ్ల్యూ సేవలు ప్రారంభిచడంతో కార్డ్‌ని ఉపయోగించకుండా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కస్టమర్లకు ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ డిజిటల్ ఆఫీసర్ అఖిల్ హండా తెలిపారు. అయితే రోజుకు రెండుసార్లు మాత్రమే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. రోజులో రూ.5 వేల వరకు ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చన్నారు. తమ బ్యాంక్ వినియోగదారులు ఈ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 11,000 పైగా ఏటీఎంలను కలిగి ఉందని తెలిపారు.
Also Read: HDFC Bank: హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు సేవలు బంద్
ఏటీఎం కార్డు లేని సమయంలో నగదు అవసరమైతే ఈ సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయి. వ్యాపారపరంగా ఎక్కువ శాతం యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నా.. ఇప్పటికీ కొన్ని దుకాణాల్లో తమకు డబ్బులే కావాలని అడుగుతున్నారు. కొన్ని పెట్రోల్ బంక్‌ల్లో కూడా యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించిన ఈ సేవలతో కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: T20 World Cup 2024: ఐసీసీ షాకింగ్ నిర్ణయం..! టీ20 వరల్డ్ కప్ వేదిక మార్పు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook