Avatar 2 OTT Release: డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా 'అవతార్ 2'.. నేటి నుంచి ఆరు భాషల్లో స్ట్రీమింగ్..

Avatar 2 OTT Release: దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్‌‌: ది వే ఆఫ్ వాటర్' చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిని ఆరు భాషల్లో అందుబాటులో ఉంచనున్నారు.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2023, 11:32 AM IST
Avatar 2 OTT Release: డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా 'అవతార్ 2'.. నేటి నుంచి ఆరు భాషల్లో స్ట్రీమింగ్..

Avatar 2 OTT Release date: ఓటీటీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'అవతార్ 2' (Avatar: The Way Of Water) నేటి నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 07 నుంచి  ఆరు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ హిందీ, మలయాళం, కన్నడ’ భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు నిర్వహకులు.

ఈ మూవీ ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఏదైనా సినిమా  థియేటర్లలో విడుదలైన తర్వాత గరిష్ఠంగా 90 రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకువస్తారు. అయితే ఈ చిత్రం ఏకంగా 173 రోజల తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇస్తుంది. ఇది వరకే ఈ మూవీని 2023 మార్చి 28 నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదికలైన మూవీఎస్‌ ఎనీ వేర్‌, యాపిల్‌ టీవీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, ప్రైమ్‌ వీడియో, ఎక్స్‌ఫినిటీ, మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో రెంట్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

2009లో రిలీజైన అవతార్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదలై భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని 25 కోట్ల యూఎస్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీకి దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా 2.9 బిలియన్ డాలర్లు వసూలు చేసి హాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ భారీగానే వసూళ్లను రాబట్టింది.

Also Read: Adipurush Pre Release Event: 'ఆది పురుష్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్.. పెళ్లిపై స్పందించిన ప్రభాస్‌!

అవతార్ ఫస్ట్ పార్ట్‌లో పండోరా అనే కొత్త గ్రహాన్ని సృష్టించిన కామెరూన్.. సెకండ్ పార్ట్‌లో సముద్రపు అడుగున చిత్రించిన సీన్లతో ప్రేక్షకులను థ్రిల్లింగ్ కు గురిచేశాడు. ఈ చిత్రంలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, కేట్ విన్స్‌లెట్, స్టీఫెన్ లాంగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి సైమన్ ఫ్రాగ్లెన్ సంగీతం అందించారు. థియేటర్లలో అదరగొట్టిన అవతార్.. ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి మరి. 

Also Read: OTT Streaming: ఓ వైపు వివాదం..అయినా ఆగని కేరళ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News