Bandi Sanjay Condemns False Allegations On Prakash Javadekar: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ మద్దతుదారులు వీడియోలను, ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల ప్రకాశ్ జవదేకర్ దైవ భక్తుడు అని.. చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదన్నారు. చెప్పులు విడిచి సాక్సులతో ఆలయంలోకి వెళ్లారని.. తాను వారితోనే ఉన్నానని స్పష్టం చేశారు.
సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు చేసే ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ రాజన్న ఆలయ అయ్యగారిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. సోమవారం కరీంనగర్‌లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించడానికి టవర్ సర్కిల్ వద్దకు వచ్చిన బండి సంజయ్‌ను మీడియా ప్రతినిధులు ప్రకాశ్ జవదేకర్‌పై జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నించారు. ప్రకాశ్ జవదేకర్ వయసు 73 ఏళ్ల పెద్దాయన అని.. నడుస్తుంటే జారి కింద పడబోతే పట్టుకున్నాని చెప్పారు. దీనిని కూడా ఫాల్తుగాళ్లు రాద్దాంతం చేస్తారా..? అంటూ మండిపడ్డారు.
అసలు ఏం జరిగింది..?
కరీంనగర్‌లో జన్ సంపర్క్ అభియాన్ పేరుతో బీజేపీ ప్రజా సంకల్ప కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం బండి సంజయ్‌తో కలిసి.. ప్రకాశ్ జవదేకర్ వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ప్రకాశ్ జవదేకర్ చెప్పులు వేసుకుని వెళ్లారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Fake news peddler at work again
It is clearly visible that @PrakashJavdekar ji has removed his footwear before entering temple
BRS Social media convenors = Footwear checkers https://t.co/ZQVvZ150wh pic.twitter.com/kOBNKxOX51
— A.Venkata Ramana (@AVRBJP) June 11, 2023
ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ప్రకాశ్ జవదేకర్ తన చెప్పులు తీసేశారని వీడియోలు వైరల్ చేశారు. అయితే ఆయన సాక్సులు వేసుకుని లోపలకి వెళ్లారని.. చెప్పులకు, సాక్సులకు తేడా తెలియదా..? అని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆయన కాళ్లకు సాక్సులు ధరించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు.
Also Read: World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..?
Also Read: Jagananna Vidya Kanuka: నేడే జగనన్న విద్యాకానుక పంపిణీ.. ఒక్కో విద్యార్థికి రూ.2,400 ఖర్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook