ICC World Cup 2023: స్కాట్లాండ్‌ చేతిలో ఓటమి.. వరల్డ్ కప్ రేసు నుంచి జింబాబ్వే ఔట్..

Zimbabwe vs Scotland: జింబాబ్వే వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్ కు దూరమైంది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో ఓడి మెగా టోర్నీకి దూరమైంది. 2019లోనూ జింబాబ్వే క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధించలేదు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2023, 09:16 AM IST
ICC World Cup 2023: స్కాట్లాండ్‌ చేతిలో ఓటమి.. వరల్డ్ కప్ రేసు నుంచి జింబాబ్వే ఔట్..

ICC World Cup 2023 Qualifiers Highlights: వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుందని అనుకున్న జింబాబ్వే జట్టు ఇంటిదారి పట్టింది. స్కాట్లాండ్‌ చేతిలో చేతిలో అనూహ్యంగా ఓడి  వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీకి దూరమైంది. 

వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం స్కాట్లాండ్, జింబాబ్వే జట్లు మధ్య 'సూపర్‌-6' మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే టీమ్ 31 పరుగులల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 234 పరుగులు చేసింది. లియాస్క్‌ (48), క్రాస్‌ (38), మెక్‌ములెన్‌ (34) రాణించడంతో స్కాట్లాండ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. జింబాబ్వే బౌలర్లలో సీన్‌ విలియమ్స్‌ (3/43), చటార (2/46) వికెట్లు తీశారు. 

అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది.  క్రిస్‌ సోల్‌ (3/33) దెబ్బకు 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. ఈ టైంలో సికందర్‌ రజా (34), మద్వీర (40)లతో కలిసి ర్యాన్‌ బర్ల్‌ (83; 84 బంతుల్లో 8×4, 1×6) గొప్పగా పోరాడాడు. అయితే విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. మెక్‌ములెన్‌, లియాస్క్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా క్రిస్ సోల్ నిలిచాడు.   

సూపర్‌-6 తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించిన జింబాబ్వే.. రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడింది. స్కాట్లాండ్‌.. సూపర్‌-6లో తన కంటే మెరుగైన వెస్టిండీస్‌, జింబాబ్వేలను ఓడించి ఇంటిదారి పట్టించింది. జింబాబ్వేపై విజయంతో స్కాట్లాండ్ దాదాపు ప్రపంచకప్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ నెల 06న నెదర్లాండ్స్ తో జరిగే సూపర్ సిక్స్ మ్యాచ్ లో స్కాట్లాండ్ గెలిస్తే నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధిస్తుంది. ఒక వేళ ఓడినా నెదర్లాండ్స్ కంటే రన్ రేట్ తక్కువ కాకుండా చూసుకుంటే ఆ జట్టుకే ప్రపంచకప్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది. 

Also Read: Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News