North India Rain Updates: కుండపోత వర్షాలకు ఉత్తరాది వణుకుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. భారీ వర్షాలకు దేశరాజధాని ఢిల్లీతోసహా పలు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరింది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లన్నీ నీటమునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ వర్షాలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.
ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికొస్తే... వర్ష బీభత్సానికి రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ రాష్ట్రంలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 17కి చేరింది. వరదల్లో 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ఉద్ధృతికి ఎన్నో ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. అంతేకాకుండా రాకపోకలు నిలిచిపోయాయి. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం ఈ హిమాలయ రాష్ట్రంలో నమోదైంది. వరద ప్రవాహానికి వంతెనలన్నీ కొట్టుకుపోతున్నాయి. దాదాపు రూ.3వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.
Also Read: Havoc flood Pics: 5 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద బీభత్సం, ఒళ్లు గగుర్పాటు కల్గించే దృశ్యాలు
భారీ వర్షాల నేపథ్యంలో పంజాబ్ లోని విద్యాసంస్థలకు ఈ నెల 13 వరకు సెలవులు ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌లో వానల ధాటికి 450 ఏళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలింది. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లోనూ 14 జిల్లాలను వర్షాలు అల్లకల్లోలం చేశాయి. మౌంట్ అబూలో 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 231 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు మృతి చెందిన వారి సంఖ్య 37కి పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు.
Also Read: Scary Videos: భయానక వీడియోలు.. భారీ వర్షానికి అతలాకుతలం అవుతున్న హిమాచల్ ప్రదేశ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook