Peanuts For Blood Pressure: గుప్పెడు పల్లీలతో అధిక రక్తపోటుకు చెక్..ఏంటి నమ్మట్లేదా ఒకసారి ట్రై చేయండి

Peanuts For Blood Pressure: అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు వేయించిన వేరుశెనగను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 11, 2023, 10:00 PM IST
 Peanuts For Blood Pressure: గుప్పెడు పల్లీలతో అధిక రక్తపోటుకు చెక్..ఏంటి నమ్మట్లేదా ఒకసారి ట్రై చేయండి

Peanuts For Blood Pressure: ఆధునిక జీవనశైలిని అనుసరించే వారిలో అతిగా వేధించే అనారోగ్య సమస్యలు అధిక రక్త పోటు ఒకటి. ఈ సమస్య చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ వస్తోంది. అయితే ఈ వ్యాధి రెట్టింపడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్య కారణంగా ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించలేకపోతే.. గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం వంటి చాలా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాకుండా ఈ వ్యాధితో బాధపడుతున్న వారు బీపీని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడిని నియంత్రించుకోవడమే కాకుండా పలు ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు ఈ బీపీ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ప్రతిరోజు వ్యాయామాలతో పాటు డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే శరీర బరువు పెరిగి అధిక రక్తపోటు సమస్య మరింత తీవ్రతరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్  

ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన పల్లీలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారట. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తపోటును అదుపులో ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాలను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బీపీని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజు వేరుశనగతో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. కాబట్టి బీపీ సమస్యలున్న వారు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి వీటిని ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో పల్లీలతో తయారుచేసిన లడ్డూలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని తినడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News