YS Sharmila to KCR: సంక్షేమ పథకాలు అన్నీ బీఆర్ఎస్ దొంగలకేనా ? : వైఎస్ షర్మిల

YS Sharmila to KCR: 10 ఏళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ దొర అమలు చేసిన ఏ పథకం చుసినా.. "అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు" అన్నచందంగానే ఉంటోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. పేదలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ దొంగల పాలవుతున్నాయ్ అని మండిపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2023, 09:07 AM IST
YS Sharmila to KCR: సంక్షేమ పథకాలు అన్నీ బీఆర్ఎస్ దొంగలకేనా ? : వైఎస్ షర్మిల

YS Sharmila to KCR: 10 ఏళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ దొర అమలు చేసిన ఏ పథకం చుసినా.. "అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు" అన్నచందంగానే ఉంటోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. పేదలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ దొంగల పాలవుతున్నాయ్ అని మండిపడ్డారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం నుంచి మొదలుపెట్టి దళిత బంధు వరకు అన్నీ అక్రమాలే చోటుచేసుకున్నాయని... అన్ని అక్రమాల్లో బందిపోట్ల దోపిడీలే జరిగాయి అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఏ ఒక్క సంక్షేమ పథకం పేదలకు అందడం లేదని మండిపడిన వైఎస్ షర్మిల.. కేసీఆర్ దొర అనుయాయులకే లబ్ధి చేకూరిందని.. అంతా వాళ్లే బాగుపడ్డారు అని ఆవేదన వ్యక్తంచేశారు. 9 ఏళ్లుగా ఊరించి ఊరించి ఇచ్చిన అరకొర 4 లక్షల పోడుపట్టాలను సైతం కేసీఆర్ అండ్ కో వదిలిపెట్టలేదు. గిరిజనులకు దక్కాల్సిన భూముల్లో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటు. అసలైన అర్హులను పక్కననెట్టి డబ్బులు ముట్టజెప్పిన వారికే పోడు పట్టాలు ఇవ్వడం కేసీఆర్ అండ్ బ్యాచ్ కే చెల్లిందని అన్నారు. 

ఇది కూడా చదవండి : వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఎటు వైపు..?

కేసీఆర్ పరిపాలనలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించిన వైఎస్ షర్మిల.. పోడు భూములకు పట్టాల విషయంలో గిరిజనుల స్థానంలో బీఆర్ఎస్ లీడర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పోడు పట్టాలు పొందడం దొర పరిపాలన దక్షతకు నిదర్శనం అని కేసీఆర్ పాలనను ఎద్దేవా చేశారు. పోడు భూములకు పట్టాల పంపిణీలో మీ డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపించిన షర్మిల.. మీరు పంచిపెట్టిన 4 లక్షల ఎకరాల్లో ఎంతమంది అర్హులకు పోడు పట్టాలు ఇచ్చారు ? ఎంతమంది అనర్హులకు కట్టబెట్టారో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పట్టాలు ఇవ్వడం ఏంటి అని మండిపడ్డారు. గిరిజనులకు బదులు గిరిజనులే కాని వారికి పట్టాలు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించారు . పట్టాల కోసం దరఖాస్తు చేసుకోని వారికి పట్టాలు ఎలా ఇచ్చారు అని అడిగారు. వెంటనే ఒక విచారణ కమిటీ వేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తోంది అని వైఎస్ షర్మిల స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : YS Sharmila to KTR: రైతు సమస్యల విషయంలో మరోసారి కాంగ్రెస్ ఆరోపణలకు మద్ధతిచ్చిన షర్మిల.. కేటీఆర్‌కి గట్టి చురకలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News