Her Movie Review: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లకు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఓ వర్గం ఆ జానర్ చిత్రాలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు రుహానీ శర్మ మెయిన్ లీడ్‌గా HER Chapter 1 అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు ఎంగేజ్ చేసిందన్నది ఓ సారి చూద్దాం.
కథ
ఏసీపీ అర్చన ప్రసాద్ (రుహానీ శర్మ) ఆరు నెలల సస్పెన్షన్ తరువాత మళ్లీ డ్యూటీ లోకి జాయిన్ అవుతుంది. అలా జాయిన్ అయిన వెంటనే విశాల్, స్వాతి అనే ఇద్దరి హత్య కేసును హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సిటీలో మరో వైపు దోపిడీ దొంగతనాలు జరుగుతుంటాయి. వాటికి ఈ హత్యకు ఏమైనా లింక్ ఉంటుందా? ఆ కేసును ఏసీపీ ఎలా చేధించింది? అసలు ఆమె ఎందుకు సస్పెండ్ అయింది? ఎన్ ఐ ఏలో ఎందుకు జాయిన్ అవ్వాలని అనుకుంటుంది? ఈ కథలో లోహ్యా, కేశవ్ పాత్రల ప్రాముఖ్యత ఏంటి? అన్నదే కథ.
నటీనటులు
రుహానీ శర్మ తనకు ఇచ్చిన ఏసీపీ అర్చన ప్రసాద్ పాత్రలో అద్భుతంగా నటించింది. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించింది. ఉన్న ఒక్క ఇక రొమాంటిక్ సీన్లలోనూ బాగానే కనిపించింది. అలా తన లుక్స్‌తోనూ అందరినీ ఆకట్టుకుంది. లోహ్యా, కేశవ, స్వాతి (అభిజ్ఞ్య), నటరాజ్, అనిల్ (రవి వర్మ) ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. చిత్రం శ్రీను కనిపించే కొన్ని సీన్లలో మెప్పిస్తాడు.
విశ్లేషణ
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లకు ఒకే రకమైన ప్యాట్రన్ ఉంటుంది. సీన్లు మారినా స్క్రీన్ ప్లే మాత్రం ఒకేలా ఉంటుంది. హర్ లాంటి సినిమాలు ఇది వరకు మనం ఎన్నో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే రుహానీ శర్మ యాక్టింగ్, ప్రజెన్స్ వల్ల ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. తెరపై నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
Also Read: Mobile Phones Under 15000: రూ. 15,000 లోపు వచ్చే చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్
ఇలాంటి కథల్లో విలన్ ఎవరై ఉంటారా? అన్నది గెస్ చేయడం కష్టంగానే ఉంటుంది. హర్ సినిమాలోనూ హత్య చేసింది ఎవరు? ఎవరు చేయించారు? ఎందుకు చేయించారు? అనేది కనిపెట్టడం కష్టంగా మారుతుంది. చాప్టర్ వన్ అని ముందే చెప్పడంతో సినిమాకు సీక్వెల్ ఉంటుందని అందరికీ అర్థం అవుతుంది. అయితే ఈ చాప్టర్ వన్‌లో హ్యాండిల్ చేసిన కేసు కాస్త క్లిష్టంగా, ఆసక్తికరంగా సాగుతుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వేగం పెరిగినట్టుగా అనిపిస్తుంది.
కొత్త దర్శకుడైనా కూడా ఎక్కడా తడబడినట్టు అనిపించదు. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా మెప్పిస్తుంది. సంగీతం, ఆర్ఆర్ మెప్పిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. నిడివి తక్కువ కావడంతో సినిమా చకచకా పరిగెత్తినట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి.
రేటింగ్: 2.75
Also Read: Maruti Suzuki EV: త్వరలో మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి