Renu Desai Comments On Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పేదల సంక్షేమ కోసం కృషి చేస్తున్నారని.. డబ్బు మనిషి కాదన్నారు. తాను మొదటి నుంచి రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. పవన్ చాలా అరుదైన వ్యక్తి అని కొనియాడారు. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించాలని కోరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
తాను జీవితంలో ముందుకు సాగిపోతున్నానని.. పవన్ కళ్యాణ్ సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారు అన్నారు రేణూ దేశాయ్. తనకు తెలిసినంత వరకు ఆయన అరుదైన వ్యక్తి అని.. డబ్బు మనిషి కాదని చెప్పారు. మనీ మైండెడ్ కాదని.. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం ఆయన పని చేయాలని అనుకుంటున్నారని అన్నారు. తాను రాజకీయంగా ఎప్పుడు ఆయనకు మద్దతుగా ఉంటూనే ఉంటానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఒక సక్సెఫుల్ యాక్టర్ అని.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే కుటుంబాన్ని పక్కనబెట్టి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించాలని.. దయచేసి ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపాలని ఆమె వేడుకున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలపై ఓ సినిమా వెబ్ సిరీస్ తీస్తున్నట్లు కొందరు అన్నారని.. తన పిల్లలనే కాదు మిగతా ఇద్దరు పిల్లలను కూడా దయచేసి ఇందులోకి లాగకండి అని కోరారు. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్న పిల్లలు అని అన్నారు. ఓ తల్లిగా ఇది తన అభ్యర్థన అని విన్నవించారు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోవాలన్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఓ చిత్రంలో సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తన తెలిసిందన్నారు. అయితే ఆ వివాదం గురించి తనకు పెద్దగా అవగాహన లేదని చెప్పారు.
Also Read: Hyderabad Metro: మెట్రో రైల్ విస్తరణపై వేగంగా అడుగులు.. మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ రివ్యూ
Also Read: RBI Repo Rate: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. రెపో రేటుపై కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook