India Vs West Indies 5th T20 Toss and Playing 11: టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చెరో రెండు మ్యాచ్‌లు గెలవగా.. చివరి పోరు నేడు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో భారత్ జోరు మీద ఉండగా.. తొలి రెండు టీ20 సత్తా చాటిన విండీస్ ఆ తరువాత కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. చివరి మ్యాచ్‌లో విజయం సాధించి.. 2016 తరువాత భారత్‌పై సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా కరేబియన్ జట్టును చిత్తు చేసి విజయంతో పర్యటనను ముగించాలని భావిస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతో భారత్ బరిలోకి దిగుతుండగా.. కరేబియన్ జట్టు ఒక మార్పు చేసింది.
"మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. ఇది మంచి బ్యాటింగ్ పిచ్. గత మ్యాచ్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. ఇలాంటి వికెట్లపై ధైర్యంగా ఆడాలి. అర్ష్‌దీప్ చివరి రెండు బంతుల్లో కూడా మ్యాచ్‌ను మార్చేయగలడు.." అని భారత కెప్టెన్ హార్థిక్ పాండ్యా తెలిపాడు.
"ముందుగా బౌలింగ్ చేయడం సంతోషంగా ఉంది. మేము కొంచెం కష్టపడ్డాము. కానీ వరుస విజయాలు అభిమానుల ముఖాల్లో చిరునవ్వును నింపుతాయి. ఇది మంచి పిచ్ అని భావిస్తున్నాను. ఒక్కొ బ్యాట్స్‌మెన్‌కు ఒక ప్రణాళికలు ఉండాలి. మేం టీమ్‌కు రావడానికి ప్రయత్నిస్తున్నాం. మెక్‌కాయ్ స్థానంలో జోసఫ్ జట్టులోకి తిరిగి వచ్చాడు." అని విండీస్ కెప్టెన్ రోవ్‌మాన్ పావెల్ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షై హోప్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్, జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్
Also Read: Bhola Shankar: భోళా శంకర్ పెద్ద రాడ్డు.. టీమిండియాదే వరల్డ్ కప్.. ఇదేక్కడి సెంటిమెంట్ మావా బ్రో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IND Vs WI 5th T20 Updates: ఫైనల్ పోరులో టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 ఇదే..!