ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ గొడవలకు అక్రమ సంబంధాలు ప్రధాన కారణం అనే విషయం తెల్సిందే. అక్రమ సంబంధాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. అక్రమ సంబంధాల మోజులు చిన్న పిల్లలను కూడా చంపేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. భార్య భర్తల మధ్య గొడవలు చాలా కామన్ అయింది. ఈ మధ్య కాలంలో జరుగుతున్న నేరాల్లో ఎక్కువ శాతం స్మార్ట్ ఫోన్ ల వల్లే అంటూ పోలీసు అధికారులు చెబుతూనే ఉన్నారు.
ఇటీవల కర్ణాటకలో జరిగిన ఒక సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న భార్య పై అనుమానంతో ఒక భర్త అమానుషంగా రోకలి బండతో మోది చంపేశాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆమె ఫోన్ లో అక్రమ సంబంధం నెరుపుతుందని భర్త ఆరోపిస్తున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా పావగడ తాలూకాలోని వైఎన్ హొసకోట పోలీస్ స్టేషన్ పరిధిలో బూదిబెట్ట గ్రామ పరిధిలో ఈ సంఘటన జరిగింది. లక్ష్మి, రామాంజినప్ప లకు పదేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఇద్దరి మధ్య ఈ మధ్య కాలంలో గొడవలు మొదలు అయ్యయి. ఆ గొడవలకు కారణం అక్రమ సంబంధం అంటూ రామాంజినప్ప సంబంధీకులు చెబుతున్నారు.
Also Read: BRS MLA Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్
కొన్ని రోజుల క్రితం భార్య లక్ష్మి ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతూ, వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగా రామాంజినప్ప తలుపు చాటుగా ఉండి విన్నాడు. ఆ విషయాన్ని స్థానిక పెద్ద మనుషుల వద్దకు తీసుకు వెళ్లాడు. ఆమె తీరు మారలేదు. పెద్ద మనుషులు ఎంత చెప్పినా కూడా లక్ష్మి తీరు మారక పోవడంతో రామాంజినప్ప కోపం కట్టలు తెంచుకుంది.
ఆమె బతికి ఉన్నంత కాలం తన పరువు పోతూనే ఉంటుందని.. ఆమెను చంపేస్తే తన కుటుంబ సభ్యులకు గౌరవం అనుకున్నాడు. పిల్లల భవిష్యత్తు కూడా పట్టించుకోకుండా అత్యంత దారుణంగా భార్య లక్ష్మిని రోకలి బండతో మోది చంపేశాడు. రాత్రి సమయంలో లక్ష్మి నిద్ర పోతూ ఉండగా రామాంజినప్ప ఈ పని చేశాడు. మృత దేహం పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన తో స్థానికులు భయబ్రాంతులకు గురి అయ్యారు. అయితే లక్ష్మి తో అక్రమ సంబంధం లో ఉన్నది ఎవరు అనే విషయాన్ని మాత్రం గుర్తించలేదు. లక్ష్మి సన్నిహితులు మాత్రం ఆమె పై రామాంజినప్ప కేవలం అనుమానం మాత్రమే అని, ఆమెకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని వాదిస్తున్నారట. అసలు విషయం ఏంటి అనేది ఎంక్వౌరీలో తేలుతుందని పోలీసులు అంటున్నారు.
Also Read: CM Jagan Mohan Reddy: ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. దసరా కానుకగా డీఏ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook