Low Price Vegetables For Diabetes Patients: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం కొంతకాలం నుంచి వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆధునిక జీవనశైలినికి అనుసరించే చాలా మంది యువత దీని బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధికి ఇప్పటి వరకు నిపుణులు ఎలాంటి ఔషధాలు కనుగొనలేదు. ప్రస్తుతం చాలా మందిలో సీజన్ మారడం కారణంగా, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని చక్కెర పరిమాణాల్లో హెచ్చు తగ్గులు వస్తున్నాయి. మరికొంతమందిలోనైతే షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోయి. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. వీరు తప్పకుండా తీసుకున్నే ఆహారాల్లో పచ్చి కూరగాయలు చేరుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు డైట్ పచ్చి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని కూరగాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ కూరగాయలు మిడిల్ క్లాస్ వారు కూడా సులభంగా కొనుగోలు చేయోచ్చు.
1. బెండకాయలు:
మధుమేహంతో బాధపడేవారికి బెండకాయ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వీటి నుంచి తీసిన వాటర్ తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గుతాయి. ఓక్రాలో లభించే ఫైబర్ రక్తంలోని చక్కెరలో శోషణను పని తీరును తగ్గిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
2. టమోటోలు:
టమోటోలు కూడా శరీరానికి ఎంతో ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు టమోటోలను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా మధుమేహం అదుపులో ఉంటుదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో అధిక మోతాదులో విటమిన్ సి కూడా లభిస్తుంది. కాబట్టి శరీరంలోని రోగనిరోధక శక్తి లోపం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
3. బచ్చలికూర:
ఆకు పచ్చని ఆకు కూరలను శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. శరీరానికి అన్ని ఆకు కూరల కంటే ఎక్కువగా బచ్చలికూర పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఐరన్ శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి బచ్చలికూర ఔషధంగా పని చేస్తుంది. తరచగా రక్తంలోని చక్కెర పరిమాణాల్లో హెచ్చు తగ్గులు ఉంటే ఆహారాల్లో తప్పకుండా బచ్చలికూరను తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి