Hyderabad Crime: ఆమెకు మూడు నెలల క్రితమే ప్రేమ వివాహమైంది. అత్తారింటికి వెళ్లిన కొద్దిరోజులకు ఆరోగ్యం క్షీణించింది. దుష్టశక్తులు ఆవహించాయనే అనుమానంతో ఆమెను బాబా దగ్గరికి తీసుకువెళ్లారు. దెయ్యాలు పట్టాయని.. పూజల పేరుతో నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని కేశవగిరిలో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా..
హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన యువతి (21)కి తలాబ్‌కట్ట భవానీనగర్‌కు ఓ యువకుడితో మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి జరిగింది. అత్తారింటికి వచ్చిన కొన్నాళ్లకే అనారోగ్యం బారినపడింది. దీంతో దుష్టశక్తులు ఆవహించాయని యువకుడి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. తల్లి సూచనతో యువతిని ఓ బర్కత్‌పురలోని ఓ బాబా వద్దకు తీసుకెళ్లాడు భర్త. అక్కడ పూజలు చేయించినా యువతి ఆరోగ్యం మెరుగవ్వలేదు. పాతబస్తీ బండ్లగూడ రహ్మత్‌నగర్‌లోని తాంత్రికుడు మజహర్‌ఖాన్ (30) గురించి తెలుసుకుని అక్కడికి తీసుకువెళ్లాడు.
యువతిని పరిశీలించిన ఆ తాంత్రికుడు.. ఐదు దెయ్యాలు పట్టాయని చెప్పాడు. వాటిని వదిలించాలంటే ప్రత్యేక పూజలు చేయాలన్నాడు. ముందుగా బాధితురాలు ఇంటిని పరిశీలించాడు. ఆ తరువాత రెండు రోజులకు తన ఇంటికి పిలిపించుకున్నాడు. భార్యను తీసుకుని వెళ్లగా.. ఆమెకు నడుము చుట్టూ దారం కట్టాలని.. కళ్లకు గుడ్డ కట్టి పూజలు చేయాలని అన్నాడు. భర్తను వెళ్లమని చెప్పి.. బాధితురాలిని పడుకోబెట్టాడు. ఆమెకు ఆయిల్‌తో మర్దనం చేశాడు. వివస్త్రను చేసి.. ఆయిల్ రాస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం పా'లతో శరీరం కడిగి.. కొత్త దుస్తులు ధరించాలని సూచించాడు. ఈ విషయాలు ఎవరికీ చెప్పొద్దని.. బయటచెబితే అనర్థాలు జరుగుతాయని చెప్పాడు. ఇంటికి వెళ్లిన తరువాత మొత్తం విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే వద్దని చెప్పి గదిలోనే బంధించారు. పది రోజుల తరువాత తమ ఇంటికి సోదరి రాగా.. ఆమెకు విషయం మొత్తం చెప్పింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ అమ్జద్‌అలీ కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు మజహర్‌ఖాన్ మహారాష్ట్రకు జంప్ అయ్యాడు. ఇన్‌స్పెక్టర్ బదిలీ కావడంతో ఈ కేసు విచారణ పడకేసింది. బాధితురాలు మరోసారి పోలీసులపై ఒత్తిడి చేయడంతో ఈనెల 22న కేసును బండ్లగూడ పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.
Also Read: Raksha Bandhan Wishes 2023: రాఖీ శుభాకాంక్షలు ఇలా ప్రత్యేక ఫోటోస్, కోట్స్‌తో తెలియజేయండి..
Also Read: Aditya-L1 Mission Rehearsals: ఆదిత్య L1 ప్రయోగం రాకెట్ చెకింగ్, రిహార్సల్స్ పూర్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook