India Vs Pakistan Dream11 Prediction Tips and Pitch Report: ఆసియా కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు బోణీ కొట్టాయి. నేపాల్‌పై పాక్, బంగ్లాదేశ్‌పై శ్రీలంక విజయాలు సాధించాయి. టీమిండియా తొలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ రేపు (సెప్టెంబర్ 2న) తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు దేశాల అభిమానులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు టీవీలకు, మొబైల్స్‌కు అతుక్కుపోవడం ఖాయం. శ్రీలంకలో కాండీ స్టేడియం వేదికగా రెండు జట్ల మధ్యాహ్నం 3 గంటలకు పోరు ఆరంభంకానుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? వివరాలు ఇలా..
పిచ్ రిపోర్ట్ ఇలా..
పల్లెకెలె క్రికెట్ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పేసర్లకు పెద్దగా సహకరించదు. బంతి బ్యాట్‌పైకి వస్తుంది. బ్యాట్స్‌మెన్ కాస్త కుదురుకుని లయను అందుకుంటే.. పరుగుల వరద పారించవచ్చు. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు 256 కాగా.. ఎక్కువసార్లు ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 14సార్లు విజయం సాధిస్తే.. ఛేజింగ్ జట్లు 18 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. వర్షం పడే అవకాశాలు ఉండడంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..
వేదిక: పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, శ్రీలంక
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు నుంచి ప్రారంభం
స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ +హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..
వికెట్ కీపర్లు: మహ్మద్ రిజ్వాన్
బ్యాట్స్మెన్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం
ఆల్‌రౌండర్లు: షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది, మహ్మద్ షమీ, హరీస్ రౌఫ్
Also Read: Kushi Twitter Review: ఖుషి మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఇదే..!
Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్లో మెరుపులు.. వీడియో చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook