Asia Cup 2023 India Vs Pakistan: ఆసియా కప్ 2023ని వరుణుడు వదలడం లేదు. గ్రూప్ దశలో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దు కాగా.. సూపర్-4 మ్యాచ్‌లకు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు. సూపర్-4లో భాగంగా ఆదివారం జరగాల్సిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (సెప్టెంబర్ 11)కు వాయిదా పడింది. సోమవారం మిగిలిన మ్యాచ్ జరగనుంది. అయితే కొలంబోలో వర్షంపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో రిజర్వ్ డే రోజున మ్యాచ్ సాఫీగా సాగుతుందో.. లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరో వైపు 'రిజర్వ్ డే' బ్యాడ్ లక్ భారత్‌ను కలవరపెడుతుంది.
కొలొంబో వాతావరణ శాఖ ప్రకారం సోమవారం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగే ఆర్ ప్రేమదాస స్టేడియంలో వర్షం కురిసే అవకాశం ఉంది. 99 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రిజర్వ్ డే రోజున మ్యాచ్ సాఫీగా సాగే అవకాశాలు తక్కువ. సోమవారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యమైతే.. పాక్ బ్యాటింగ్ చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ 24 ఓవర్లు ఆడేసింది. డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం.. ఫలితం తేలాలంటే.. ఒక్కో జట్టు 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.
గత రికార్డులను పరిశీలిస్తే రోహిత్ సేనను 'రిజర్వ్ డే' ముప్పు కలవరపెడుతుంది. రిజర్వ డే రోజు పాక్‌పై భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మరోవైపు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ చివరిసారిగా 'రిజర్వ్ డే' మ్యాచ్ ఆడింది. మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ రిజర్వ్ డే రోజున జరిగే మ్యాచ్‌లు భారత్‌కు శుభవార్త అందించకపోవడమే టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్ ఈ సమస్యను అధిగమించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: Chandrababu Case: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు,స్నేహ బ్లాక్ ఖైదీ నెంబర్ 7691
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook