Mercury Direct Movement 2023 effect: జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఇతడిని తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. ఎవరి జాతకంలో బుధుడు స్థానం బలంగా ఉంటుందో వారికి గౌరవంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ప్రస్తుతం సింహరాశిలో మెర్క్యూరీ తిరోగమనంలో ఉన్నాడు. రేపటి నుండి అంటే సెప్టెంబరు 16న బుధుడు నేరుగా నడవబోతున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. బుధుడి ప్రత్యక్ష సంచారం వల్ల ఏయే రాశులవారికి మేలు జరగబోతుందో తెలుసుకుందాం.
సింహరాశి
ఇదే రాశిలో మెర్క్యూరీ నేరుగా నడవనున్నాడు. ఈసమయంలో మీకు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. మీరు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో లాభపడతారు.
ధనుస్సు రాశి
ఈ సమయంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది.
మిధునరాశి
బుధుడి ప్రత్యక్ష సంచారం మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. మీరు కొత్త వెహికల్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Moon transit 2023: ఇవాల్టి నుంచి ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook