Saturn Rajayogam 2023: హిందూమతంలో శని గ్రహాన్ని న్యాయ దేవతగా భావిస్తారు. అందుకే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. శని గ్రహం ప్రతి కదలిక వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. ఈసారి శని గ్రహం ఒకేసారి రెండు రాజయోగాలు ఏర్పర్చనుంది. ఫలితంగా 4 రాశులపై ఊహించని ధనలాభం వచ్చి పడనుంది.
హిందూమతంలో శని గ్రహాన్ని కర్మ ఫలదాతగా కూడా పిలుస్తారు. అంటే చేసిన పనుల్ని బట్టి ప్రతిఫలాన్ని ఇచ్చేది శని గ్రహమే. శని గ్రహం ఇప్పుడు కుంభ రాశిలో గోచారంలో ఉంది. ప్రస్తుతం వక్రావస్థలో ఉన్న శని గ్రహం త్వరలో రాజయోగం ఏర్పర్చనుంది. ఇది కొన్ని రాశులకు అమితమైన ప్రయోజనాన్ని కల్పించనుంది. న్యాయ దేవతగా, శిక్షించేవాడుగా భావించే శని గ్రహం గోచారం, అస్తమించడం, ఉదయించడం, వక్రావస్థ, సక్రమ మార్గం ఇలా అన్నీ మనిషి జీవితంపై ప్రభావం చూపించనున్నాయి. ఫలితంగా త్రికోణ రాజయోగం ఉంటుంది. నవంబర్ నెలలో శశ రాజయోగం ఉంది. ఈ రెండు రాజయోగాలను అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఫలితంగా 4 రాశులకు అమితమైన ప్రయోజనం కలగనుంది.
వృషభ రాశి జాతకులకు త్రికోణం, శశ రాజయోగాలు పాజిటివ్ పరిణామాలు కల్గించనున్నాయి. అంతులేని లాభాలు కలగనున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి వృద్ది కన్పిస్తుంది. ఆర్ధికంగా ప్రయోజనం ఉంటుంది. అదే సమయంలో ఉద్యోగం కోసం అణ్వేషిస్తున్నవారికి కోరిక నెలవేరుతుంది. ఉన్నత ఉద్యోగావకాశాలుంటాయి. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తదు.
శని గ్రహం కటాక్షంతో సింహ రాశి జాతకులపై శశ, త్రికోణ రాజయోగాల కారణంగా సానుకూల ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా భౌతిక, సుఖ సంతోషాలు కలగనున్నాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేయవచ్చు. చట్టపరమైన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. పెండింగులో లేదా నిలిచిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. పెళ్లి జీవితంలో మెరుగ్గా ఉంటుంది.
శని గ్రహం రెండు రాజయోగాల కారణంగా తుల రాశి జాతకులకు ప్రయోజనం కలగనుంది. ఆర్ధికంగా ఎదుగుతారు. ధన సంబంధిత విషయాల్లో బాగుంటుంది. ఆర్దికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఉద్యోగంలో బదిలీలు, పదోన్నతి లాభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు.
కుంభ రాశి జాతకులకు త్రికోణ, శశ రాజయోగం వరాలు కురిపించనుంది. ఊహించని విధంగా కనకవర్షం కురవనుంది. ఈ రాశి జాతకులకు శని గ్రహం కటాక్షం ఎల్లప్పుడూ ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్ధిక ప్రగతి ఉంటుంది. పెండింగులో ఉన్న లేదా ఎక్కడైనా నిలిచిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్ధిక లాభం కలగవచ్చు.
Also read: Budh Gochar: మరికొన్ని గంట్లలో ఈ 3 రాశులవారు ధనవంతులు కాబోతున్నారు.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook