White Hair: చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వస్తోందా?, ఈ హెన్న మిశ్రమంతో 7 రోజుల్లో చెక్..
White Hair Solution: పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తప్పకుండా జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన కొన్ని హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించే చాలా మంది కొన్ని రోజుల తర్వాత తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఎలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఆయుర్వేద నిపుణులు కొన్ని హోం రెమెడీస్‌ను సూచిస్తున్నారు. దీనిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా జుట్టు కూడా దృఢంగా మారుతుంది.
అన్ని జుట్టు సమస్యలకు హెన్నా ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును పొడవుగా చేసేందుకు కూడా సహాకరిస్తుంది.
జుట్టు పెరుగుదల కోసం:
గోరింట ఆకులతో తయారు చేసిన హెన్నా మిశ్రమం జుట్టు పెరుగుదలకు ప్రభావంతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మిశ్రమంలో మొంతుల పొడిని మిక్స్ చేసి జుట్టుకు పట్టిస్తే జుట్టు సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలకుండా కూడా సహాయపడుతుంది.
చుండ్రు తగ్గుతుంది:
జుట్టులోని చుండ్రు కారణంగా వెంట్రుకలు బలహీనంగా మారతాయి. అంతేకాకుండా కొంతమందిలో విరిగిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. తలలో దురద, జుట్టు పెరగడం ఆగిపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి గోరింట ఆకు, ఆవాల నూనె మిశ్రమం ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 1 గంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే అన్ని జుట్టు సమస్యలు తగ్గుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
జుట్టు రాలడం తగ్గుతుంది:
గోరింట ఆకు మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం వల్ల సులభంగా జుట్టు రాలడం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు మందంగా చేస్తాయి.
తెల్ల జుట్టు కోసం:
చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమెడీని వినియోగించాల్సి ఉంటుంది. ఈ గోరింటకు మిశ్రమంలో లభించే పలు రకాల మూలకాలు తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. సులభంగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ రెమెడీని వినియోగించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
White Hair: చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వస్తోందా?, ఈ హెన్న మిశ్రమంతో 7 రోజుల్లో చెక్..