India vs Australia: వరల్డ్ కప్ లైవ్ షో లో పాల్గొననున్న మాస్ మహరాజా రవితేజ

ODI WC 2023: ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు ముందు క్రికెట్ లైవ్ షోలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ పాల్గొననున్నాడు. ఈ మెగా టోర్నీలో ఆతిథ్య జట్టు టీమిండియా ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2023, 05:23 PM IST
India vs Australia: వరల్డ్ కప్ లైవ్ షో లో పాల్గొననున్న మాస్ మహరాజా రవితేజ

Ravi Teja at World Cup: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 రేసు మెుదలైంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ లో  ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడతున్నాయి. ఇక ఆతిథ్య ఇండియా అక్టోబరు 08న తన ప్రపంచకప్ వేటను మెుదలుపెట్టనుంది. ఆదివారం జరిగే తన తొలి మ్యాచ్ లో ఆసీస్ ను ఢీకొట్టబోతుంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ కు ముందు తెలుగు క్రికెట్ లైవ్ షోలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ పాల్గొననున్నాడు.  అంతేకాకుండా క్రికెట్ అభిమానులతో ముచ్చటించనున్నాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం మధ్యాహ్నాం 2 గంటలకు మ్యాచ్ మెుదలుకానుండగా.. 12.30 గంటల నుంచే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఈ లైవ్ షో రానుంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. రవితేజ ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. 

అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. దేశంలోనే అతిపెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. జీవీ ప్రకాశ్ కుమార్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 20న ఆడియెన్స్ ముందుకురానుంది. ఇది తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో రవితేజకు జోడిగా నుపుర్ సనన్ నటించింది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, మురళీ శర్మ, తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read: Dhawan-Ayesha Mukherjee Divorce: ధావన్‌కు బిగ్ రిలీజ్.. భార్యతో విడాకులు మంజూరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News