India Vs Afghanistan Playing11 and Dream11 Team Tips: వరల్డ్ కప్ వేటను విజయంతో ప్రారంభించిన భారత్.. రెండో విజయంపై కన్నేసింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఆరు వికెట్లతో ఓడించింది. నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఆఫ్ఘన్ చిన్న జట్టే అయినా.. ప్రమాదకరమే. గతంలో ఎన్నోసార్లు పెద్ద జట్లకు షాకిచ్చింది. టీమిండియా లైట్ తీసుకోకుండా.. శక్తి మేర ఆడితే విజయం పక్కా. ఇక ఈ మ్యాచ్‌కు కూడా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దూరం అయ్యాడు. డెంగ్యూ చికిత్సకు ఆసుపత్రిలో చేరిన గిల్.. డిశ్చార్జ్ అయ్యాడు. అయితే జట్టుతో ఇంకా చేరలేదు. ఇషాన్ కిషన్ మరోసారి రోహిత్ శర్మకు జోడిగా ఓపెనర్‌గా రానున్నాడు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండు జట్ల ప్లేయింగ్11 ఎలా ఉండనుంది..? పిచ్ రిపోర్ట్ ఏంటి..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..
పిచ్ రిపోర్ట్ ఇలా..
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. అయితే తొలి మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్లకు ఎక్కువగా సహకరించింది. ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్ మొత్తం సగటు 220 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌కు వర్షం కురిసే అవకాశం లేదు. రాత్రి సమయంలో మంచు కురిసే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
స్ట్రీమింగ్ వివరాలు ఇలా..
==> వేదిక: ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం
==> సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ప్రారంభం
==> స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్, యాప్
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా.
డ్రీమ్ 11 టీమ్ ఇలా..
వికెట్ కీపర్లు: కేఎల్ రాహుల్, రహ్మానుల్లా గుర్బాజ్
బ్యాటర్లు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్
ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అజ్మతుల్లా ఒమర్జాయ్
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రషీద్ ఖాన్
Also Read: Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? రూల్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇవే..
Also Read: Chandrabau Case: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంలో విచారణ శుక్రవారానికి వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి