ODI World Cup 2023, ENG vs AFG Highlights: వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్‌కు షాకిచ్చింది పసికూన అఫ్గానిస్థాన్. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ 69 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది.
మెుదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ కు ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా గుర్బాజ్ చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. మరోవైపు జద్రాన్ ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జద్రాన్ తర్వాత వచ్చిన షాహీది కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఓమర్జాయ్ కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు. అనంతరం వచ్చిన అలిఖిల్ హాప్ సెంచరీతో రాణించాడు. రషీద్, రెహ్మాన్ కూడా రాణించడంతో అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు, మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది అప్ఘాన్. 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది డిఫెడింగ్ ఛాంపియన్. ఇంగ్లీష్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (66), మలన్ (32) మాత్రమే రాణించాడు. మిగతా బ్యాట్స్ మెన్ అందరూ విఫలమయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో స్పిన్నర్లు ముజీబుర్ రహ్మాన్, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీశాడు. మహమ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read: Hardik Pandya: ఏం మంత్రం వేశావ్ పాండ్యా.. వెంటనే అలా వికెట్ పడింది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి