Black Sesame Benefits: నువ్వుల్లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యంగా, శక్తివంతంగా తయారవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో నువ్వులు రెండు రకాలుగా లభిస్తున్నాయి. ఒకటి నల్ల నువ్వులైతే రెండవది తెల్ల నువ్వులు..ఈ రెండింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా నల్ల నువ్వుల్లో కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి జుట్టు సమస్యల వరకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి నల్ల నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
నల్ల నువ్వులు తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలు:
యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి:
నల్ల నువ్వులు యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే గుణాలు మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:
నల్ల నువ్వులలో పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని వినియోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా గుండె కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
నల్ల నువ్వులలో పీచు పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మల విసర్జన ప్రక్రియ సులభమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యలను తగ్గించి పొట్టను ఆరోగ్యంగా చేస్తుంది.
మెదడుకు ప్రయోజనకరంగా ఉంటుంది:
నల్ల నువ్వులు పోషకాల నిధి అని ఆయుర్వేద నిపుణులు భావిస్తారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. దీంతో పాటు మెదడును మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.
కాలేయాన్ని ఆరోగ్యంగా చేస్తుంది:
నల్ల నువ్వుల్లో శరీరలోని వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు నల్ల నువ్వులను ఆహారంలో తీసుకోవడం వల్ల కాలేయ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..