బీజేపీ లో యువతకు స్థానం లేదు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. టికెట్ ఇవ్వని అసమ్మతి నేతలు పార్టీలు మారటం లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి టికెట్ ఇవ్వని సందర్భంగా భావోద్వాగానికి గురయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2023, 07:32 PM IST
బీజేపీ లో యువతకు స్థానం లేదు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి

Enugula Rakesh Reddy Comments on BJP: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటు అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు తమ ప్రచార సభల్లో బిజీ బిజీగా ఉన్నారు. టికెట్ ఇవ్వని అసమ్మతి నేతలు పార్టీలు మారటం లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి టికెట్ ఇవ్వని సందర్భంగా భావోద్వాగానికి గురయ్యారు. 

హరిత హోటల్ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. పార్టీనే కుటుంబం అనుకున్న, పార్టీ కార్యకర్తలనే కుటుంబ సభ్యులు అనుకున్న.. 11 ఏండ్ల ప్రస్థానంలో ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో శక్తివంచన లేకుండా పని చేశా.. కానీ, టికెట్ అడిగిన పాపానికి పార్టీ నన్ను పక్కన పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి వందల మంది కార్యకర్తలను తయారు చేశాను. ఈ పార్టీలో నా పదేళ్ల శ్రమ ఉంది. ఇంచార్జిగా బాధ్యతలు ఇస్తే ఆదిలాబాద్, కొత్తగూడెం అడవులకు వెళ్లి పనిచేశా.. కానీ, పార్టీ అనేక అవమానాలకి గురి చేసింది. రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో కనీసం పార్టీ జిల్లా ఆఫీస్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టనివ్వలేదు. అయినా ఏ నాయకుడు ప్రశ్నించలేదు. 

ఏ డివిజన్ కి వెళ్తే ఆ డివిజన్ అధ్యక్షుడితో కంప్లైంట్ చేయించి నోటీసులు అంటూ ప్రచారం చేశారు.. నాతో మాట్లాడిన పాపానికి డివిజన్ అధ్యక్షులను పార్టీ నుంచి తొలగించారు. 11 ఏండ్ల లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. ఓరుగల్లులో ప్రతి సమస్య పై గొంతు విప్పి పార్టీకి ఆదరణ పెంచిన. పార్టీ గౌరవాన్ని పెంచిన. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన కార్యకర్తలను మోటివేట్ చేసి సర్పంచ్, ఎంపీటీసీ నుంచి కార్పొరేటర్ల వరకు అందరినీ గెలిపించా.. అన్ని అర్హతలు సాధించిన తర్వాత చివరకు వరంగల్ వెస్ట్ అభ్యర్థి గా నాపేరు కన్సిడర్ చేయాలని చేయడమే నేను చేసిన తప్పా..? అప్పటి నుంచే ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. 

Also Read: New Rules From Today: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. తప్పకుండా తెలుసుకోండి..!  

నాకు నోటీస్ ఇస్తే.. ఏ ఒక్కరూ స్పందించలేదు.. ఇదేం పార్టీ, సర్వేల ఆధారంగానే టికెట్ ఇస్తామన్నారు. అదంతా పచ్చి బూటకం.. సర్వేలు, పబ్లిక్ టాక్ మొత్తం నా వైపు ఉంది. కానీ, టికెట్, ప్రతి డివిజన్ తిరిగి 30 వేల కుటుంబాలను కలిసా.. ఏమైనా అంటే భవిష్యత్ ఉందని అంటున్నారు. ఏజ్ అఐపోయి నెత్తురు చచ్చినంక ఇస్తారా..? బీజేపీ లో యువతకు స్థానం లేదు. ప్రశ్నించే గొంతులను కోసేస్తున్నరు. నాడు దేవ్ సాంబయ్య నుంచి నా వరకు.. ప్రజా బలం ఉన్నోళ్లను అణచి వేస్తున్నారు. మూడు సర్వేల్లో నా పేరే ఉంది. టికెట్ ప్రకటించే 25 రోజుల ముందు కమిటీ రాకేశ్ రెడ్డి పేరుతోనే రిపోర్ట్ ఇచ్చింది. బీజేపీ లో సిద్ధాంతాలు లేవు.. మన్ను లేదు.

సిద్ధాంతాలు పక్కన ప్రజా బలం ఉండి టికెట్ అడిగిన ఏకైక నాయకుడిని నేను. మహిళా కోటా ను స్వాగతిస్తా.. కానీ యువత కోటా వద్దా..? బీజేపీ 2 లిస్ట్ ఒకే ఒక పేరుతో ఇచ్చారు.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు, వేల కోట్ల ఆస్తి పరుడు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చారు. పేద, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వరా..? జిల్లా బీజేపీ ని శాసిస్తున్న ఒకాయన 30 ఏండ్ల నుంచి బీజేపీ కి పట్టిన శని సిద్ధాంతం పేరు చెప్పి బానిసలుగా మారుస్తున్నారు. బీజేపీ లో ఎవరికీ అవకాశాలు లేవు. రావు.. 2019 లో 4 ఎంపీ లు గెలిచిన తర్వాత బీజేపీ కి మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ వర్గ పోరు వల్ల పార్టీని భూ స్థాపితం చేశారు. బీజేపీ కి మేనిఫెస్టో ఉందా? ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు..? వరంగల్ లో కరోనా, వరదల సమయంలో ఎంతగానో సేవ చేసినం వరద తాకిడికి నిలబడి ఆహారం అందించినం. దీన్ని కనీసం పార్టీ ప్రశంసించలేదు. కానీ, ప్రజలు గుర్తించారు.

Also Read: Zee Telugu Award : ఈ ఆదివారం ప్రేక్షకులను ఆదరించడానికి సిద్ధమైపోయిన జీ తెలుగు కుటుంబ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

 

Trending News