MLA Rathod Bapurao Joined BJP: అవినీతిని ప్రోత్సహించే బీఆర్ఎస్ పార్టీ.. అవినీతిపరులు, లిక్కర్ మాఫియాకు పాల్పడేవారికే టికెట్లు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలంతా ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి నివాసంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే (బోథ్) రాథోడ్ బాపూరావ్‌తో పాటుగా.. మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెల్లమల కృష్ణారెడ్బి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందని సీనియన్ కాంగ్రెస్ నాయకుడు సుభాష్ రెడ్డి, ఇతర నాయకులు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపూరావ్.. ఇవాళ బీజేపీలో చేరడం.. గిరిజన ప్రాంతాల్లో, ఆదిలాబాద్ వంటి వెనుకబడినప్రాంతాల్లోనూ బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమన్నారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని నెట్టేసిన కేసీఆర్‌కు సరైన బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలను కోరారు. అటు కర్ణాటకలో హామీల అమలులో.. వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ తెలంగాణలో హామీల పేరుతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన 5 నెలలుగా.. రాష్ట్రంలో.. ‘తెలంగాణ ఎలక్షన్ టాక్స్’ పేరుతో అక్కడి పారిశ్రామికవేత్తలనుంచి డబ్బులు వసూలు చేస్తోందని ఆయన అన్నారు. ఆ డబ్బునే ఇక్కడ ఎన్నికల్లో ఖర్చుకోసం వినియోగిస్తోందన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశంలో విలువలు కలిగిన రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చే బీజేపీ వైపు నాయకులు, ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ డబ్బులు కుమ్మరిచ్చి ఎన్నికల్లో గెలుద్దామని చూస్తుందని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇలాంటి ఆలోచనలకు సరైన బుద్ధి చెబుతారన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో గిరిజన ఎమ్మెల్యేలను అవమానించేలా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. రాథోడ్ బాపూరావ్ వంటి సౌమ్యుడు, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తికి కేసీఆర్ దర్బార్‌లో గుర్తింపు దక్కనందునే.. వారు బీజేపీలో చేరారన్నారు. ఇది కల్వకుంట్ల కుటుంబ అహంకారానికి నిదర్శనమన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రికి ఫూజల ద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని.. కానీ ప్రజా సంక్షేమం కోసం చేసే పూజలే సత్ఫలితాలను ఇస్తాయన్నారు. ఇతరులు మునిగిపోవాలని చేసే పూజలకు ఫలితం ఉండదన్నారు. జన వశీకరణ కోసం పూజలు చేయడమే సీఎం ఆలోచన అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తన ఆలోచన ఫలితమే అని ఘనంగా చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు మేడిగడ్డ బ్రిడ్జి కుంగిపోతే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తాజాగా అన్నారం బ్యారేజీకి కూడా పగుళ్లు ఏర్పడుతున్నట్లుగా వస్తున్న వార్తలతో.. ప్రజల్లో ఆందోళన నెలకొందని.. దీనిపై ముఖ్యమంత్రి, కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకూ కేసీఆర్‌పై వ్యతిరేకత పెరిగిపోతోందన్నారు. కేవలం బీజేపీ ద్వారానే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. చంద్రబాబును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటోందని.. తెలంగాణ ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తారన్నారు.
Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి