7th Pay Commission DA Hike Latest News: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. డియర్నెస్ అలవెన్స్ పెంపుతోపాటు 3 నెలల బకాయిలను బహుమతిగా ఇచ్చింది. నవంబర్‌లో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు భారీగా పెరిగాయి. 4 శాతం డీఏను పెంచింది. దీంతో మొత్తం డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి చేరింది. జూలై 1వ తేదీ నుంచి అమలు చేసింది. తదుపడి డీఏ పెంపు వచ్చే ఏడాది జనవరిలో ఉంటుంది. డీఏ పెంపు AICPI ఇండెక్స్ డేటాపై ఆధారపడి ఉంటుంది. వచ్చే ఏడాదికి కూడా 4 శాతం డీఏను పెంచితే 50 శాతానికి పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు డీఏ, డీఆర్‌ను జనవరి మరియు జూలైలలో సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తోంది.
జూలై, ఆగస్టుల AICPI సూచిక సంఖ్యల తర్వాత.. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలు విడుదలయ్యాయి. ఆల్ ఇండియా CPI-IW సెప్టెంబర్‌లో 1.7 పాయింట్లు క్షీణించి 137.5కి చేరుకుంది. దీంతో డీఏ స్కోరు 48.54 శాతానికి తగ్గింది. ఇప్పటివరకు ఈ సంఖ్య 2.50 శాతం పెరిగింది. అక్టోబరు, నవంబర్, డిసెంబర్ల గణాంకాలు త్వరలో వెలువడతాయి. అక్టోబర్‌లో ఈ సంఖ్య 49 శాతం దాటితే.. అది డిసెంబర్ నాటికి 50 శాతం దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే డీఏ 4 శాతం పెరుగుతుంది. అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ డేటా ఆధారంగా జనవరిలో డీఏ పెంపుపై నిర్ణయం ఉంటుంది.
వచ్చే ఏడాది జనవరి 2024 నాటికి మరోసారి డీఏ నాలుగు శాతం పెంచితే.. 50 శాతానికి చేరుకుంటుంది. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ 50 శాతం దాటితే.. మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారు. 50 శాతాన్ని బేసిక్ పేకు కలుపుతారు. అదేవిధంగా ఇతర అలవెన్సులు కూడా 25 శాతం వరకు పెరుగుతాయి. 7వ వేతన సంఘం 2013లో ఏర్పాటవ్వగా.. దాని సిఫార్సులను 2016లో అమలు చేశారు. డీఏ 50 శాతం దాటి.. జీరోగా మారితే ప్రభుత్వం కొత్త పే కమిషన్ (8వ వేతన సంఘం)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
8వ వేతన సంఘం అమలు సాధ్యం కాకపోతే.. జీతం పెంపునకు సంబంధించి కొత్త నిబంధన తీసుకురావాలి. ఇప్పటివరకు చూసుకుంటే.. ప్రతి ఏళ్లకు ఒకసారి ఒక కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ లెక్కన వచ్చే ఏడాదికి కొత్త పే కమిషన్‌ను ఏర్పాటను ప్రకటించాల్సి ఉంది. అదే విధంగా లోక్‌సభ ఎన్నికలు కూడా వచ్చే ఏడాదే జరగనుండడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్ వస్తుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.
Also Read: Pan India Movies: పాన్ ఇండియా సినిమాలతో ఓటీటీలకు తలనొప్పి..భారీ స్థాయిలో నష్టాలు
Also Read: Nepal Earthquake 2023: నేపాల్‌లో భారీ భూకంపం, 70మందికి పైగా మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook