Uttarakhand Tunnel Rescue Operation: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సేఫ్‌గా బయటకు వచ్చారు. 17 రోజుల తర్వాత 41 మంది కార్మికులను ఎట్టకేలకు విజయవంతంగా బయటకు తీసుకువచ్చారు. నవంబర్ 12న ఉత్తర్‌కాశీ సొరంగంలో 41 మంది కూలీలు వెళ్లగా.. అనంతరం సొరంగం పాక్షికంగా కుప్పకూలింది. దీంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. వారు చిక్కుకున్న ప్రాంతం వరకు డ్రిల్లింగ్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. అందులో గొట్టాన్ని పంపించారు. అందులోని నుంచి ఒక్కొక్కరిని బయటకు తీశారు. సొరంగం లోపల రెండు కిలో మీటర్ల తిరిగేందుకు స్థలం ఉండడం.. బయట నుంచి ఆహారం, తాగునీరు, మెడిసిన్ అందుకునే వెసులుబాటు ఉండడంతో వారంత క్షేమంగా ఉన్నారు. కూలీలు బయటకు రాగానే అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌ల్లో ఆసుపత్రులకు తరలించారు. టన్నెల్ నుంచి కూలీలు బయటకు వస్తున్న సమయంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘటన స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. 17 రోజుల తరువాత కార్మికులు బయటకు రావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమించాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో మధ్యలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను సహాయక చర్యలు చేపట్టారు. చివరి 41 మందిని సురక్షితంగా టన్నెల్‌ను నుంచి బయటకు తీసుకువచ్చి ప్రాణాలను రక్షించారు.
కార్మికులు టన్నెల్లో చిక్కుకోగా.. వారిని రక్షించేందుకు భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. సొరంగ శిథిలాల్లో 57 మీటర్ల పొడవునా గొట్టపు మార్గాన్ని తవ్వాలని నిర్ణయించారు. ఆగర్ యంత్రం సాయంతో డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. 47 మీటర్లు తవ్వగా.. మరో 10 పది మీటర్ల తవ్వితే కూలీల వద్దకు చేరుకుంటామనే సమయంలో ఆగర్ యంత్రం టెన్నెల్లోని ఇనుపపట్టీని ఢీకొట్టింది. దీంతో దాని బ్లేడ్లు విరిగిపోవడంతో మిషన్ పనిచేయలేదు. దీంతో కొండమీద నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్ పనులు మొదలుపెట్టి.. మరోవైపు టెన్నెల్లో అడ్డుఆ ఉన్న ఆగర్ మిషన్ శిథిలాలను తొలగించారు.
అనంతరం 12 మంది‘ర్యాట్ హోల్ మైనర్లను రంగంలోకి దింపి.. మిగిలిన 10 మీటర్ల డ్రిల్లింగ్ పనిని వీరు మాన్యువల్‌గా చేపట్టారు. సోమవారం రాత్రి తవ్వకాలు చేపట్టగా.. మంగళవారం రాత్రికి పూర్తియ్యాయి. 57 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తికావడంతో కూలీలు ఉన్న ప్రాంతం వరకు ఓ గొట్టాన్ని పంపించారు. ఆ గొట్టం ద్వారా 41 మందిని సురక్షితంగా బయటకు తీశారు. అధికారుల బృందంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
కార్మికులను రక్షించడపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ.. చరిత్రలో అత్యంత కష్టతరమైన రెస్క్యూ మిషన్ ఇది అని.. అద్భుతమైన దృఢ సంకల్పంతో పనిచేసిన అధికారులు, నిపుణులందరినీ అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. "17 రోజుల పాటు వారి కష్టాలు, రెస్క్యూ ప్రయత్నానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇది మానవ సహనానికి నిదర్శనం. దేశం వారి స్థితిస్థాపకతకు నమస్కరిస్తుంది. కృతజ్ఞతతో ఉంటుంది." అని రాష్ట్రపతి రాసుకొచ్చారు. ఉత్తరకాశీలో కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ రెస్క్యూ మిషన్‌లో పాల్గొన్న ప్రజలందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను.." అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Telangana Election 2023: ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తం, చివరిరోజు పీక్స్‌కు ప్రచారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి