Dil Raju: గేమ్ చేంజర్ మూవీపై దిల్ రాజు అప్ డేట్.. క్యూలో మరో ఏడు సినిమాలు

Game Changer: సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా వచ్చిన యానిమల్ సినిమా తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన దిల్ రాజు.. సక్సెస్ ప్రెస్ మీట్ హైదరాబాదులో నిర్వహించి తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2023, 03:56 PM IST
Dil Raju: గేమ్ చేంజర్ మూవీపై దిల్ రాజు అప్ డేట్.. క్యూలో మరో ఏడు సినిమాలు

Dil Raju in Animal success meet: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న ప్రొడ్యూసర్స్ లో ఒకరు దిల్ రాజు. ఆయన సొంతగా నిర్మించడమే కాదు కొన్ని డబ్బింగ్ సినిమాలను తెలుగులో విడుదల చేసి కూడా లాభాలు పొందుతూ ఉంటారు ఈ నిర్మాత. ఈ నేపథ్యంలో ఈ మధ్య విడుదలైన యానిమల్ సినిమాని కూడా తెలుగులో ప్రజెంట్ చేసింది దిల్ రాజునే. ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

దీంతో ఈ సందీప్ రెడ్డివంగా యానిమల్ సినిమాని సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన దిల్ రాజు.. ఆ సినిమా సూపర్ సక్సెస్ ఆనందాన్ని పంచుకోవడానికి ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన రాబోయే సినిమాల గురించి అలానే ముఖ్యంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం గురించి కొన్ని అప్డేట్స్ ఇచ్చారు.

 ముందుగా యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ..’2023 మాకెంతో కలిసి వచ్చిన సంవత్సరం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ సంవత్సరం నేను నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన సినిమాలు మంచి విజ‌యాలు సాధించాయి. ఈ ఏడాది ఇంకా హాయ్ నాన్న సినిమాను కూడా డిస్ట్రిబ్యూట్ చేయ‌బోతున్నాం’మ. ఇక ‘యానిమల్’ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రం సినీ అభిమానులకు బాగా క‌నెక్ట్ కావ‌డంతో తొలి రోజు రికార్డ్ క‌లెక్షన్స్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.15 కోట్ల మేర‌ గ్రాస్ వసూలు చేసింది. ఇక ఇప్పుడు వీకెండ్ కావడంతో ఈ జోరు అలానే కొనసాగితే ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్‌లో రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల వసూలు చేస్తుంది అని మేము అంచనా వేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

ఆ తరువాత హిందీ తెలుగు ఇండస్ట్రీల గురించి మాట్లాడుతూ..’మ‌న హీరోలైన ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి విజ‌యాల‌ను సాధించాయి. ప్రస్తుతం హిందీ హీరోల సినిమాలను కూడా మ‌న ప్రేక్షకులు ఆద‌రిస్తున్నారు. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆద‌రిస్తార‌న‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు’ అని దిల్ రాజు తెలియజేశారు.

ఇక తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ.. ‘వచ్చే సంవత్సరం శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో నాలుగు సినిమాలు చేస్తున్నాము..అలాగే దిల్‌ రాజు ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌లో మూడు సినిమాలు నిర్మిస్తున్నాము. మొత్తంగా ఏడు సినిమాల‌ను స‌రైన స‌మ‌యంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావ‌డానికి ప్లాన్ చేస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు. 

ఇక తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రామ్ చరణ్ సినిమా ‘గేమ్ ఛేంజ‌ర్’ ఎందుకు ఆలస్యమవుతుందనే విషయం గురించి మాట్లాడుతూ..’గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. రాజమౌళి, శంక‌ర్, సుకుమార్‌, సందీప్ వంగ లాంటి
దర్శకులను టైమ్ అడ‌గ‌కూడ‌దు. దర్శకుడు శంకర్.. ఆయ‌న ప్లానింగ్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంది. అంతా పూర్తయిన త‌ర్వాత ఆయ‌న పోస్ట్ ప్రొడ‌క్షన్ స‌మ‌యం చెప్పే దాన్ని బ‌ట్టి రిలీజ్ డేట్ మేము ప్రకటిస్తాము’ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు దిల్ రాజు.

Also read: Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..

 

Also Read: Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News