Telangana New Government: కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, ఎవరెవరికి ఏయే శాఖలు

Telangana New Government: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణలో మూడవ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 7, 2023, 04:10 PM IST
Telangana New Government: కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, ఎవరెవరికి ఏయే శాఖలు

Telangana New Government: తెలంగాణ రాష్ట్రంలో మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎల్బీ స్డేడియంలో వేలాది ప్రజల సమక్షంలో, కాంగ్రెస్ అతిరధ మహానేతల సమక్షంలో రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ మంత్రివర్గంలో ఎవరెవరికి ఏయే శాఖలు అప్పగించారో తెలుసుకుందాం..

తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్డేడియంలో మద్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ప్రమాణం చేయించారు. రేవంత్ రెడ్డి తరువాత ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. ఆ తరువాత వరుసగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్శింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రమాణ స్వీకారం మొదలైనప్పుడే ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలుగొట్టామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక తమ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామ్యులని, రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బారు నిర్వహిస్తామని తెలిపారు. తాము పాలకులం కాదని, సేవకులమని, ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. 

ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో తొలిసారి మంత్రి అయినవారు మల్లు భట్టివిక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. 

మంత్రులు- కేటాయించిన శాఖలు

భట్టి విక్రమార్క                        ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి                హోం మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు                  ఆర్ధిక శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి          నీటి పారుదల శాఖ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి             మున్సిపల్ శాఖ
తుమ్మల నాగేశ్వరరావు             ఆర్ అండ్ బి శాఖ
దామోదర రాజనర్శింహ          వైద్య ఆరోగ్య శాఖ
జూపల్లి కృష్ణారావు                      పౌర సరఫరాలు
సీతక్క                                        గిరిజన సంక్షేమ శాఖ
కొండా సురేఖ                             మహిళా సంక్షేమ శాఖ

Also read: China Disease: ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏడు కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News