China Disease: ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏడు కేసులు

China Disease: చైనాలో ప్రారంభమైన అంతుచిక్కని వ్యాధి ఇప్పుడు ఇండియాలో ప్రవేశించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్‌లో మైకో ప్లాస్మా న్యుమోనియో పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 7, 2023, 03:33 PM IST
China Disease: ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏడు కేసులు

China Disease: కరోనా మహమ్మారి నుంచి తేరుకునేలోగా మరోసారి చైనా నుంచి మరో అంతు చిక్కని వ్యాధి బయలుదేరిన విషయం తెలిసిందే. చిన్నారుల్ని టార్గెట్ చేస్తున్న ఈ వ్యాధి పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా ఊహించిందే జరిగింది. అప్పుడే ఈ బ్యాక్టీరియా ఇండియాలో వచ్చేసింది. దేశ రాజధానిలో ఇప్పుడు ఏడు కేసులు గుర్తించడం కలకలం రేపుతోంది.

చైనాలో కరోనా తరువాత మరో అంతు చిక్కని వ్యాధి ప్రారంభమైంది. ముఖ్యంగా చిన్నారుల్ని ఈ వ్యాధి టార్గెట్ చేస్తోంది. చైనా ఆసుపత్రుల్లో ఈ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల్లో న్యుమోనియో వంటి లక్షణాలు కన్పించసాగాయి. అధిక జ్వరం, ఊపిరితిత్తుల్లో స్వెల్లింగ్ అనేవి ప్రధాన లక్షణాలుగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. చైనాలో ఆసుపత్రులు ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులతో నిండిపోతున్నాయనే వార్తలు కలకలం రేపాయి. ఈ వ్యాధికి కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. మైకో ప్లాస్మా న్యుమోనియాగా గుర్తించారు. బ్యాక్టీరియా కారణంగా వస్తుందని తెలిసింది. ఇప్పుడీ వ్యాధి దేశ రాజధాని ఢిల్లీలో ప్రవేశించడం ఆందోళన కల్గిస్తోంది. 

ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏడు మైకో ప్లాస్మా న్యుమోనియా కేసుల్ని గుర్తించారు. ఏప్రిల్-సెప్టెంబర్ మద్యనే ఇండియాలో ఏడు శాంపిల్స్ రికార్డయినట్టుగా లాన్సెట్ మైక్రోబ్ అధ్యయనం వెల్లడించింది. పీసీఆర్ పరీక్షలో సమయంలో ఒక కేసు బయటపడగా మిగిలిన ఆరు కేసులు ఐజీఎం ఎలీసా పరీక్ష ద్వారా వెలుగుచూశాయి. ఇందులో పీసీఆర్ పాజిటివిటీ రేటు 3 శాతముంటే ఐజీఎం ఎలీసా పాజిటివిటీ రేటు 16 శాతముంది. ఈ ఏడాది అంటే 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 30 పీసీఆర్ పరీక్షలు, 37 ఐజీఎం ఎలీసా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 7 పాజిటివ్‌గా తేలాయి.

ఇప్పటికే ఈ మైకో ప్లాస్మా న్యుమోనియా కేసులు అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్ సహా పలుదేశాల్లో నమోదయ్యాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఎంటర్ కావడంతో దేశంలో అలర్ట్ విధించారు. ఇది బ్యాక్టీరియా కారక వ్యాధిగా గుర్తించారు. ఇది అంటువ్యాధిగా మారుతుందో లేదో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. పౌష్టికాహారం తీసుకుని ఇమ్యూనిటీ పెంచుకోవడం ద్వారా మాత్రమే చిన్నారుల్ని రక్షించవచ్చంటున్నారు. 

Also read: Assembly Election Results: 90 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు<

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News