Tulsi Plant Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి విశేషత చాలా ఉంది. వాస్తు ప్రకారం తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే తులసి మొక్కను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే హిందువుల్లో ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పూజలు చేస్తుంటారు.
హిందూమతంలో తులసి మొక్కకు ఉన్న విశిష్టత, ప్రాధాన్యత దృష్ట్యా ప్రతి రోజూ క్రమం తప్పకుండా తులసి మొక్కకు పూజలు చేస్తుంటారు. అటు విష్ణువుకు ఇటు లక్ష్మీదేవికి తులసి మొక్కంటే అత్యంత ప్రీతిపాత్రం. తులసి మొక్కను అందుకే అంత పవిత్రంగా భావిస్తారు. రోజూ క్రమం తప్పకుండా తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సదా ఉంటుందని నమ్మకం. అంతేకాకుండా ఆ ఇంట్లో ధన సంపదలకు ఎన్నడూ లోటు రాదు. అదే సమయంలో మీ ఇంట్లో తులసి మొక్కలో వచ్చే మార్పులు అదృష్ట దురదృష్టాల్ని సూచిస్తుందంటున్నారు వాస్తు పండితులు. అంటే మీ ఇంట్లో ధనలాభం కలుగుతుందా లేక ధనహాని ఉంటుందా అనేది తులసి మొక్కలో కన్పించే లక్షణాల్ని బట్టి అంచనా వేయవచ్చు.
ఇంట్లో తులసి మొక్కలో ఈ లక్షణాలుంటే..
మీ ఇంట్లో తులసి మొక్క ఒక్కసారిగా పచ్చదనంతో నిండుగా మారితే లక్ష్మీదేవి కటాక్షం ఊహించని విధంగా ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. అంటే త్వరలోనే మీకు లేదా మీ ఇంట అంతులేని ధన సంపదలు రావచ్చు. చేపట్టిన ప్రతి పనిలో సాఫల్యం లభిస్తుంది. ఇక అదే సమయంలో తులసి మొక్క చుట్టూ చిన్న చిన్న మొలకలు కన్పిస్తే..మీ ఇంట్లో ధనలక్ష్మి వస్తుందని అర్ధం. ఏదైనా శుభవార్త వినవచ్చు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
తులసి మొక్కకు నిర్ణీత సమయం కంటే ముందే పూలు పూస్తే ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుందని అర్ధం. తులసి పూలు పూయడం శుభసంకేతం. లక్ష్మీదేవి, విష్ణువు పూజలు చేయాల్సి ఉంటుంది.
తులసి మొక్క విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు
తులసి మొక్కను ఎప్పుడూ కుండీలోనే వేయండి. తులసి మొక్కను నేరుగా భూమిలో ఎప్పుడూ పెంచకూడదు. తులసి మొక్క చుట్టుపక్కల శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. చీపురు వంటివి అస్సలుంచకూడదు. తులసి మొక్క సమీపంలో డస్ట్ బిన్, చెప్పులు వంటివి ఉండకూడదు. ఇలా చేయడం తులసి మొక్కను అవమానించడమే. దీనివల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.
Also read: Sun Transit 2023: ఈ మూడు రాశులకు డిసెంబర్ 16 నుంచి మహర్దశే, ఊహించని ధనలాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook