Rice Flour For Underarm Whitening: అండర్ ఆర్మస్ సమస్యతో బాధపడుతున్నవారు తమకు నచ్చిన బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అంతేకాకుండా దీని కారణం తీవ్రమైన దుర్వాసన కూడా వస్తుంది. దీని కోసం మార్కెట్లో ఉండే డియోడ్రెంట్లను,కెమికల్ ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత ఎక్కువగా అవుతుందని డెర్మటాలజిస్ట్ వైద్యులు చెబుతున్నారు.
ఈ సమస్యను ఇంటి చిట్కాలు ఉపయోగించి పరిష్కారించ వచ్చని అంటున్నారు. ఇలా చేయడం వల్ల చర్మం నల్లగా కాకుండా, మరింత వ్యాధుల బారిన పడకుండా ఉంటారని డెర్మటాలజిస్ట్ నిపుణులు అంటున్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా సులంభంగా అండర్ ఆర్మస్ని తెల్లగా మార్చుకోవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలి? ఎంత కాలంలో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు? అనే విషయంపై ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అండర్ ఆర్మస్ తెల్లగా కనిపించాలి చిట్కా ఇదే..
తక్కువ ఖర్చుతో సులభంగా ఇంటిలో అందుబాటలో ఉండే వస్తువులను ఉపయోగించి కూడా అండర్ ఆర్మస్ ను తెల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ కోసం ఖర్చు చేసే అంత డబ్బు అవసరం లేదు. వంటి ఇంట్లో ఉపయోగపడే పదార్థాలు వాడుతే సరిపోతుంది. వంట ఇంట్లో ఎక్కువగా ఆహార పదార్థాలో ఉపయోగించే బీయ్యం పిండిని చర్మ సమస్యల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇది నల్లగా కనిపించే ప్రదేశలను సులువుగా తెల్లగా మార్చుకోవచ్చు.ఇలా చేసి చూడండి.
Also Read: How To Get Rich: ధనవంతులు కావాలంటే.. ఈ 4 విషయాలు తప్పక గుర్తుంచుకోండి
మిశ్రమం తయారీ ఇలా..
రెండు టీ స్పూన్ల బియ్యం పిండిని, అర టీ స్పూన్ కొబ్బరి నూనె లేద అలోవెరా జెల్‌ను, రెండు టీ స్పూన్ల నిమ్మరసంను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని పేస్ట్ చేసుకోవాలి. దీనిని బ్రష్ తో లేద చేతితో అండర్ ఆర్మస్ దగ్గర నెమ్మదిగా రుద్దుకోవాలి.
ఈ మిశ్రమం ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అండర్ ఆర్మస్‌లో ఉన్న నలుపు, మురికి తొలగిపోయి చర్మం తెల్లగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఈ చిట్కాను వారానికి మూడు సార్లు వాడడం వల్ల చర్మం తెల్లగా మారుతుంది.
Also Read: Cloves Benefits: పురుషుల ఆరోగ్యం, లైంగిక సామర్ధ్యం పెంచే అద్బుతమైన చిట్కా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook