PAK Bans New Year Celebrations: పాకిస్థాన్‌లో నూతన సంవత్సర వేడుకలు బ్యాన్ అయ్యాయి. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు ఆ దేశ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో వివాదంలో ఉన్న పాలస్తీనా, గాజాలకు మద్దతుగా పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వర్-ఉల్-హక్ కకర్ నూతన సంవత్సర వేడుకలపై కఠినమైన నిషేధాన్ని ప్రకటించారు. పాలస్తీనియన్లతో ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో నిగ్రహాన్ని, వినయాన్ని ప్రదర్శించాలని ప్రజలకు సూచించారు. పాలస్తీనాలో తమ సోదరులకు సంఘీభావంగా నూతన సంవత్సర కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. అమాయక పిల్లలను ఊచకోత కోయడం, గాజా, వెస్ట్ బ్యాంక్‌లో నిరాయుధులైన పాలస్తీనియన్ల మారణహోమం పట్ల మొత్తం పాకిస్థాన్, ముస్లిం ప్రపంచం తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని అన్నారు.
పాలస్తీనాకు రెండు సహాయ ప్యాకేజీలను పంపించామని.. మూడో సాయం పంపించేందుకు రెడీ అవుతున్నట్లు పాక్ ప్రధాని వెల్లడించారు. అంతర్జాతీయ వేదికలపై పాలస్తీనా ప్రజల దుస్థితిని వెలుగులోకి తీసుకురావడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ చేస్తున్న హింసను అంతం చేయడానికి తాము అంకితభావంతో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలను నిర్వహించడంపై ప్రభుత్వం కఠినమైన నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
"పాలస్తీనాలో తీవ్ర సమస్యాత్మకమైన పరిస్థితుల దృష్ట్యా మా సోదరులు, సోదరీమణులకు సంఘీభావంగా ప్రభుత్వం ఏ విధమైన నూతన సంవత్సర కార్యక్రమాలను నిర్వహించడం లేదు. దేశవ్యాప్తంగా కఠినమైన నిషేధాన్ని ప్రకటించింది. ప్రజలు అంతా న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలి" అని పాక్ ప్రధాని వెల్లడించారు.
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు.. 1,200 మందిని హతమార్చారు. 240 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లారు. అనంతరం హమాస్ ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్.. గాజాలో దాడులు మొదలుపెట్టింది. ఉగ్రవాదులను ఏరి వేస్తూ.. ఊచకోత కోస్తోంది. ఇప్పటివరకు దాదాపు 21 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉండడంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై విమర్శలు వస్తున్నాయి. గాజాలోని 85 శాతం మందిని ఖాళీ చేయించిన ఇజ్రాయెల్.. ఉగ్రవాదుల కోసం వేటను కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఆపకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: Devil Movie Review: కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter