AR Rahman: హ్యాపీ బర్త్ డే టు ఏఆర్ రెహమాన్, చెర్రీ సినిమాకు సంగీతం అతడిదే

AR Rahman: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్..తన సినిమాకు సంగీతం అందిస్తున్న విషయాన్ని అధికారికం చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 6, 2024, 05:10 PM IST
AR Rahman: హ్యాపీ బర్త్ డే టు ఏఆర్ రెహమాన్, చెర్రీ సినిమాకు సంగీతం అతడిదే

AR Rahman: టాలీవుడ్ నటుడు, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అలియాస్ చెర్రీ..ఏఆర్ రెహమాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. హ్యాపీ బర్త్ డే ఇసై పులి అంటూ చెర్రీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అదే సమయంలో తన సినిమాకు సంగీతం అందిస్తున్న విషయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. 

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ 16వ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సినిమాతో కిలారు సతీష్ నిర్మాతగా పరిచంయ కానున్నారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సినిమా నిర్మాణం కానుంది. భారీగా నిర్మాణ వ్యయం, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మించనున్న చిత్రాన్ని మైత్రీ మువీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇదొక హై బడ్జెట్ సినిమా. ఖర్చుతో పాటు సాంకేతిక విలువలు కూడా భారీగానే ఉండనున్నాయి. రామ్ చరణ్ కాకుండా ఇంకెవరు ఈ సినిమాలో నటించేది తెలియలేదు. 

ఈ సినిమాకు సంగీతం అందించేది ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అని అనధికారికంగా విన్పిస్తూ వచ్చింది. ఉదయనిధి మారన్ తమిళ సినిమా మామన్నన్ విడుదల సందర్బంగా ముచ్చటించిన ఏఆర్ రెహమాన్‌ను ఇదే విషయం ప్రశ్నించతగా చర్చలు జరుగుతున్నాయనే సమాధానమిచ్చారు. కానీ ఇవాళ ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా అటు రామ్ చరణ్, ఇటు వృద్ధి సినిమాస్ అధికారికంగా నిర్ధారణ చేశాయి. బర్త్ డే విషెస్ అందిస్తూనే  వెల్కం ఏఆర్ రెహమాన్ అంటూ ట్వీట్ చేశారు. 

వాస్తవానికి సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుంటారు. సుకుమార్‌తో పాటు ఆయన శిష్యుడు బుచ్చిబాబు సినిమా ఉప్పెనకు కూడా డీఎస్పీ సంగీతం అందించాడు. కానీ ఇప్పుడు చెర్రీతో తీసే సినిమాకు మాత్రం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఇదే విషయాన్ని చెర్రీ అధికారికంగా నిర్ధారించారు. 

Also read: Corona New Variant Jn.1 Threat: కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 భవిష్యత్తులో ప్రమాదకరంగా మారనుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News